రోగ నిరోధక శక్తిని సహజంగా ఎలా పెంచుకోవాలి ?

రోగ నిరోధక శక్తిని సహజంగా ఎలా పెంచుకోవాలి ?

హైదరాబాద్ ముచ్చట్లు:

మనం తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రోగ నిరోధక శక్తిని పెంచుకోవడంలో కొన్ని రకాల ఆహార పదార్థాలు ఉపయోగపడతాయి. బీటా కెరోటిన్‌, విటమిన్‌ సి ఎక్కువగా లభించే ఆహార పదార్థాలను తీసుకోవాలి.

నారింజ, నిమ్మ జాతికి చెందిన పండ్లను తీసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. రోజులో కనీసం గంటసేపు ఏదైనా వ్యాయామం చేయాలని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ వ్యాయామం చేయకపోయినా వీలైనంత ఎక్కువగా నడవడానికి ప్రయత్నించాలని నిపుణులు చెబుతున్నారు. మొత్తం మీద శారీరక శ్రమను పెంచాలని చెబుతున్నారు.

బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా మాస్కులు ధరించండి.  ఈ మాస్కలు ముక్కు, నోరు మూసే విధంగా పెట్టుకోవాలి. తరచుగా శానిటైజర్ను వాడండి.  సాధ్యమైనంత వరకు భౌతిక దూరం పాటించండి.  కరచాలనం ( షేక్ హ్యాండ్స్) లాంటివి ఇవ్వకుండా ఉండాలి.  విష్ చేయాలంటే షేక్ హ్యాండ్ కు బదులుగా నమస్కారం పెట్టడం అలవాటు చేసుకోండి.

వైరస్‌ దరిచేరకుండా ఉండాలన్నా, రోగనిరోధక శక్తి పెరగాలన్నా శరీరం హైడ్రేట్‌గా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. శరీరానికి తగినంత నీటిని తీసుకోవాలని సూచిస్తున్నారు. శరీరం నిత్యం హైడ్రేట్‌గా ఉంటే శరీరం నుంచి ప్రమాదకరమైన టాక్సిన్స్‌ను తొలగించడంలో ఉపయోగపడుతుంది. ప్రతీ రోజూ కనీసం 7 నుంచి 8 గ్లాసుల నీరు తాగాలని చెబుతున్నారు.

రోగ నిరోధక శక్తి పెరగడంలో నిద్ర కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతుంటారు. సరిపడ నిద్ర ఉంటేనే ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యకరమైన పెద్దలు రోజులో కనీసం 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలని అంటున్నారు. నిద్రలేమితో ఇబ్బందిపడే వారి రోగనిరోధక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఇక మానసిక ఆరోగ్యాన్నికూడా కాపాడుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఒత్తిడిని దూరం చేసుకునేందుకు మెడిటేషన్‌, యోగా వంటి వాటిని అలవాటు చేసుకోవాలని చెబుతున్నారు. మానసిక ఆరోగ్యం బాగుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుందని పేర్కొంటున్నారు.

tags: How to increase immunity naturally?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *