పార్ల‌మెంట్‌లో పాసైన చ‌ట్టాన్ని రాజ్యాంగ వ్య‌తిరేక‌మ‌ని ఎలా ప్ర‌క‌టిస్తారు

– చీఫ్ జ‌స్టిస్ ఎస్ఏ బోబ్డే

Date:09/01/2020

న్యూ ఢిల్లీ  ముచ్చట్లు:

దేశంలో సంక్లిష్ట ప‌రిస్థితులు నెల‌కొన్నాయ‌ని చీఫ్ జ‌స్టిస్ ఎస్ఏ బోబ్డే తెలిపారు. పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టం రాజ్యాంగ వ్య‌తిరేక‌మ‌ని, దాన్ని ర‌ద్దు చేయాల‌ని దాఖ‌లైన పిటిష‌న్‌పై ఇవాళ సుప్రీంకోర్టు విచార‌ణ చేప‌ట్టింది. చాలా సంక్లిష్ట‌మైన ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఇలాంటి పిటిష‌న్లు ఏమీ చేయ‌లేవ‌న్నారు. అయితే దేశ‌వ్యాప్తంగా హింసాత్మ‌క అల్ల‌ర్లు ఆగితేనే, పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టం వ‌ర్తింపు అంశంపై పిటిష‌న్లు స్వీక‌రిస్తామ‌ని చీఫ్ జ‌స్టిస్ తెలిపారు. సీఏఏను రాజ్యాంగ వ్య‌తిరేక‌మ‌ని ప్ర‌క‌టించాల‌ని న్యాయ‌వాది వీన‌త్ ధండా త‌న పిటిష‌న్‌లో కోరారు. సీఏఏపై దుష్ ప్ర‌చారం నిర్వ‌హిస్తున్న కార్య‌క‌ర్త‌లు, విద్యార్థులు, మీడియా సంస్థ‌ల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. పార్ల‌మెంట్‌లో పాసైన ఓ చ‌ట్టాన్ని రాజ్యాంగ వ్య‌తిరేక‌మ‌ని ఎలా ప్ర‌క‌టిస్తార‌ని చీఫ్ జ‌స్టిస్ ప్ర‌శ్నించారు. ప్ర‌స్తుతం శాంతిని నెల‌కొల్పేందుకే మ‌నం ప్ర‌య‌త్నించాల‌న్నారు.

మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ రావుకు సీబీఐ గట్టి షాక్

Tags: How to pass constitutional passage in Parliament

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *