సామాజిక వ్యాప్తి..అరికట్టేది ఎలా

Date:08/08/2020

న్యూఢిల్లీ ముచ్చట్లు:

 

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20 లక్షలకు చేరువలో ఉన్నాయి. ఇలాగే కొనసాగితే ఆగస్టు నెలలో యాభై లక్షలకు కేసులు చేరుకునే అవకాశముందన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. రోజుకు యాభై వేల కేసులు నమోదవుతుండటం భయం కల్గిస్తుంది. నిన్న మొన్నటి వరకూ నగరాలకే పరిమితమయిన కరోనా ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలకు విస్తరించింది.ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరినీ వదలిపెట్టకుండా కరోనా భారత్ లో చెలరేగిపోతుంది. అమెరికా వంటి దేశాల్లో కొంత కంట్రోల్ అవుతున్న సమయంలో భారత్ లో మాత్రం రోజురోజుకూ తీవ్రత పెరుగుతోంది. అయితే రికవరీ శాతం 64.6 శాతం ఉండటం కొంత ఊరట కల్గించే అంశమయినా రానున్న కాలంలో మరణాల సంఖ్య కూడా ఎక్కువగా పెరిగే అవకాశముంది. ఇప్పటికే అనేక చోట్ల కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి జరిగిందన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.భారత్ లో కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ లాక్ డౌన్ మినహాయింపుల్లో మాత్రం వెనక్కు తగ్గడం లేదు. జిమ్ లకు, యోగా కేంద్రాలకు కూడా మినహాయింపునిచ్చింది. రాత్రివేళ కర్ఫ్యూను కూడా ఎత్తివేశారు. ఈ నేపథ్యంలో కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అందుకే మహారాష్ట్ర వంటి చోట్ల ఆగస్టు 31 వ తేదీ వరకూ లాక్ డౌన్ ను విధించారు. మహారాష్ట్రలోనే కేసుల సంఖ్య ఐదు లక్షలు దాటడం విశేషం.అనేక రాష్ట్రాలు ఇప్పటికే కరోనా కేసుల తీవ్రతను బట్టి లాక్ డౌన్ ను అమలు చేస్తున్నాయి. మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఆసుపత్రుల్లో బెడ్స్ కొరత కూడా తీవ్రమవుతోంది. దీంతో చాలా మంది రోగులను హోం ఐసోలేషన్ లోనే ఉంచుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే భారత్ లో ఆగస్టు నెలలో కరోనా కేసులు యాభైలక్షలు దాటే అవకాశముంది. కరోనా భారత్ లోకి ప్రవేశించి ఆరు నెలలు కావస్తోంది.

 

 

 రాజీనామా చేసిన తర్వాతే ఫ్యాన్ క్రిందకి…

 

Tags:How to prevent social spread

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *