ప్రమాదాలు సంభవిస్తే ఎలా రక్షించుకోవాలి

Date:09/11/2019

ఎమ్మిగనూరు ముచ్చట్లు:

అగ్ని ప్రమాదాలు సంభవిస్తే ఎలా రకహించుకోవాలి అనే అవగాహన ప్రతి ఒక్కరికి అవసరమని అగ్నిమాపక శాఖ అధికారి మోహన్ పేర్కొన్నారు.హనుమాపురంలోని పీర్లచావిడి వద్ద శనివారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.గ్యాస్ ప్రమాదాల పట్ల తెలుసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు నూనె పదార్థాల వంటలు చేసేటపుడు జరిగే ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని ప్రమాదాల నుంచి తప్పించుకొనే సూచనలను వివరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూనె పదార్థాల వంటలు చేసేటపుడు ప్రమాదాలు సంభవించినప్పుడు వాటిని నీటితో ఆర్పడానికి ప్రయత్నించకుండా అందుబాటులో ఉన్న ఏదైన పిండి(జొన్న పిండి,రాగి పిండి మొదలైన)తో ప్రమాదాలను అరికట్టవచ్చన్నారు.చిన్న,చిన్న మంటలను అట్ట లేదా పేపర్ల ద్వారా ఒకేసారి కప్పి అదుపు చేయొచ్చన్నారు.ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ రంగస్వామి,ఆపరేటర్ మోహన్,కానిస్టేబుల్ సుధాకర్,విశ్వనాథ్,రాజారమేష్ తదితరులు పాల్గొన్నారు.

 

‘భీష్మ’ తొలి వీడియో దృశ్యాలకు విశేష ఆదరణ

 

Tags:How to protect against accidents

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *