నీటి పొదుపు గురించి తెలియజేసే వారే నీటిని వృధా చేస్తే ఎలా… ?

Date:30/03/2020

తుగ్గలి ముచ్చట్లు:

గ్రామంలో నీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రజలు.
తుగ్గలి ఎంపీడీవో కార్యాలయం వద్ద వృధాగా పోతున్న నీరు.
నలుగురికి చెప్పేవారే,నీటిని వృధా చేస్తే ఎలా అంటున్న గ్రామస్తులు.
అసలే వేసవి కాలం,సరైన వర్షాభావం లేక చెరువులు,బావులు మరియు బోర్లు పూర్తిగా ఇంకిపోయాయి, గ్రామంలో నీటి సమస్య రోజురోజుకూ తీవ్రమవుతున్న సమయంలో ప్రభుత్వ అధికారులు నీటిని వృధా చేస్తూ నిదర్శనంగా నిలిచారు.మండల కేంద్రమైన తుగ్గలిలోని స్థానిక ఎంపిడిఓ కార్యాలయంలో నందు సోమవారం రోజున కార్యాలయానికి సంబంధించిన నీటి ట్యాంకు పూర్తిగా నిండి,చాలా సేపు వరకూ మంచి నీరు వృధాగా వెళ్ళిపోయింది.అంతసేపు మంచి నీరు వృధా అవుతున్న అధికారులు ఎవరూ పట్టించుకోకపోవడంతో గ్రామ ప్రజలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు గ్రామంలోని పీర్ల మసీదు కాలనీ,బిసి కాలనీ,బోయ వీధి మరియు కొట్టాల వీధులలో నివసిస్తున్న ప్రజలు నీరు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.నీటి సమస్యలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు అధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళిన వారు పట్టి పట్టనట్టు వ్యవహరిస్తున్నారు.ఈ కరోనా వైరస్ ప్రభావంతో ప్రజలందరూ బయటికి రాకుండా ఇళ్లల్లో ఉంటున్నందున నీటి వాడకం అధికమవుతుందని, దీనికి ప్రత్యామ్నాయాన్ని అధికారులు త్వరగా చూపాలనే గ్రామస్తులు తెలియజేస్తున్నారు.గ్రామాలలో ఉన్న చేతిపంపులను పట్టించుకునే నాధుడే లేడు. ఉన్న ఒక చేతి పంపు వద్ద ప్రజలందరూ అలాగే గుమిగూడడంతో ఏ ప్రమాదం ఎటువైపు నుంచి వస్తుందో అని గ్రామస్తులు భయాందోళనకు గురి అవుతున్నారు.గ్రామంలో ఇంత నీటి కొరత ఉంటే ప్రభుత్వ కార్యాలయాల వద్ద నీరు వృధాగా వెళ్లడం నిర్లక్ష్యానికి నిదర్శనమని వారు తెలియజేశారు.ఇప్పటికైనా అధికారులు నిర్లక్ష్యాన్ని వీడి ఈ సమస్య పునరావృతం కాకుండా చూడాలని గ్రామస్తులు అధికారులకు తెలియజేస్తున్నారు. అదేవిధంగా గ్రామంలో ఉన్న నీటి సమస్యను అధికారులు పరిష్కరించాలని గ్రామస్తులు తెలియజేస్తున్నారు.

కూరగాయల మార్కెట్ ను  పరిశీలించిన ఏఎంసీ చైర్మన్

Tags:How to waste water …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *