వినియోగదారులకు హెచ్ పి సి ఎల్ గ్యాస్ సరఫరా

HPCL gas supply to consumers

HPCL gas supply to consumers

Date:31/12/2018
వరంగల్ అర్బన్ ముచ్చట్లు:
హెచ్‌పీసీఎల్ గ్యాస్ బాట్లింగ్ ప్లాంట్ నుంచి ఉత్తర తెలంగాణలోని 13 జిల్లాల వినియోగదారులకు గ్యాస్ సిలిండర్లను సరఫరా చేయడం జరుగుతుందని మాజీ మంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. కమలాపూర్ గ్రామ శివారులో నూతనంగా నిర్మిస్తున్న హెచ్‌పీసీఎల్ గ్యాస్ బాట్లింగ్ ప్లాంట్‌ను కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌తో కలిసి సందర్శించారు. ప్లాంట్‌లో కలియతిరిగి నిర్మాణ పనులను పరిశీలించారు. హెచ్‌పీసీఎల్ అధికారులతో మాట్లాడి వివరాలను తెలసుకున్నారు.
తరువాత ఈటల రాజేందర్ మాట్లాడుతూ  రెండు, మూడు నెలల్లో గ్యాస్ బాట్లింగ్ ప్లాంట్ నిర్మాణం పూర్తవుతుందని భావిస్తున్నామన్నారు. రోజు మూడు షిఫ్టు పద్దతుల్లో గ్యాస్ సిలిండర్లను ఫిల్లింగ్ చేయడం జరుగుతుందని తెలిపారు. ఒక్కొక్క షిఫ్టులో సుమారు 14వేల సిలిండర్లను ఫిల్లింగ్ చేసి సరఫరా చేయనున్నారన్నారు.
భవిష్యత్‌లో వచ్చే డిమాండ్‌కు అనుగుణంగా ప్లాంట్‌ను విస్తరణ చేసేందుకు అవకాశం ఉందన్నారు. ఈ ప్లాంట్‌లో స్థానికులకు ఉపాధి అవకాశాలను కల్పిస్తామన్నారు. కరీంనగర్ ఎంపీ వినోద్‌కుమార్ మాట్లాడుతూ  గ్రామాల ప్రజలతో పాటు వరంగల్, కరీంనగర్ పట్టణాల ప్రజలకు అందుబాటులో ఉండేందుకు కమలాపూర్‌లో గ్యాస్ బాట్లింగ్ ప్లాంట్‌ను నిర్మాణం చేయడం జరుగుతుందన్నారు. వినియోగదారులకు సకాలంలో గ్యాస్ సిలిండర్లను సరఫరా చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లక్ష్మణ్‌రావు, జడ్పీటీసీ నవీన్‌కుమార్, సింగిల్ విండో చైర్మన్ సంపత్‌రావు, హెచ్‌పీసీఎల్ గ్యాస్ ప్లాంట్ మేనేజర్ సురేష్, మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు రమేష్, కుమారస్వామిగౌడ్, సాంబరావు, సమ్మిరెడ్డి, మల్లయ్య, ఇంద్రసేనారెడ్డి, రామచంద్రం, అరవింద్, సంపత్, రాములు, సతీష్ పాల్గొన్నారు.
Tags:HPCL gas supply to consumers

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed