పురుగుమందుల నిషేధంపై భిన్నాభిప్రాయాలు

Date:10/09/2020

వ‌రంగ‌ల్ ముచ్చట్లు:

కేంద్ర ప్రభుత్వం నిషేధించాలనుకుంటున్న 27 పురుగు మందులను ఒకేసారి కాకుండా ఒకదాని తరువాత మరొకటి నిషేధించాలని జయశంకర్ వ్యవసాయ వర్సిటీ సూచన చేసింది. ప్రమాదకరమైన కొన్నింటిని నిషేధించాలని అయితే మరికొన్నింటికి ప్రత్యామ్నాయం సూచించే వరకు కొనసాగింపునివ్వాలని తెలిపింది. అవి ప్రస్తుతం రైతులకు సరసమైన ధరలకే అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. ఒక్కొదానిని పూర్తిగా పరిశీలన చేసిన తరువాత నిషేధంలోకి తీసుకురావాలని తెలిపింది. లేకుంటే రైతులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం 27 రకాల పురుగు మందుల నిషేధంపై ముసాయిదా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిపై జయశంకర్ వ్యవసాయ వర్సిటీ సూచనలు చేసింది.ప్రత్యామ్నాయాలతో చూస్తే ఇవి సాధారణమైన పురుగు మందులని, తక్కువ ధరకే ఇక్కడి రైతులకు అందుబాటులో ఉంటున్నాయని వివరించింది. సిఐబి అండ్ ఆర్‌సి (సెంట్రల్ ఇనెసెక్టిసైడ్స్ బోర్డు అండ్ రిజిస్ట్రేషన్ కమిటీ) మార్గదర్శకాల ప్రకా రం బయోఎఫిషియసీ డేటా, ఉత్పత్తులలో ఆవశేషాల డేటా ను సమర్పించడం తప్పనిసరి. ఈ సమాచారం ఇవ్వకుండా పురుగు మందులు నమోదు చేయడం కుదరదని పేర్కొంది. డేటా సరిపోలేదని ముసాయిదా ప్రతిపాదన తీర్మానంలో ఉందని, అలాంటప్పుడు వాటి బయో ఎఫిషియససీ పునః పరిశీలించాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తల బృందం స్పష్టం చేసింది.

 

 

 

వాస్తవానికి పురుగుమందుల నిరంతర వాడకంతో ప్రకృతి దెబ్బతింటోంది.వాటికి ప్రత్యామ్నాయంగా సూచించాల్సినవి వీటన్నింటి నుంచి సమయ పరిమితుల నుండి తప్పించుకుంటాయనే గ్యారంటీ లేదని తెలిపింది. భారత దేశం ఎదుర్కొంటున్న అనేక సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఈ పురుగు మందులను ఒకేసారి కాకుండా సిఐబి అండ్ ఆర్‌సి ప్రాతిపదికన జాతీయ స్థాయిలో ఆహార ఉత్పత్తుల్లో అవశేషాల స్థాయి, ఇతర సంబంధిత సమస్యలను సమీక్షించి క్రమానుగతంగా నిర్ణయాలు తీసుకోవాలని జయశంకర్ వ్యవసాయ వర్సిటీ సూచించింది. ప్రస్తుతం పత్తిలో గులాబీ రంగు పురుగు, మొక్కజొన్నలో కత్తెర పురుగు, కలుపు తీసేందుకు కూలీల కొరత, ఎప్పటికప్పుడు పెరుగుతున్న జనాభాకు ఆహార భద్రత వంటి వాటికి ఒకేసారి ఈ పురుగు మందులను నిషేధిస్తే ప్రతికూలంగా మారే అవకాశం ఉందని వివరించింది.

 

 

 

 

ఆ పురుగు మందుల రిజస్టర్డ్ ఉత్పత్తులన్నింటిని ప్రభావితం చేస్తుందని ఫలితంగా రైతులు ఇబ్బందులను ఎదుర్కొంటారని పేర్కొంది.జయశంకర్ వ్యవసాయ వర్సిటీ నిపుణుల బృందం ప్రకారం మోనోక్రోటోఫోస్, కార్బోఫ్యూరాన్, మెథొమైల్, బెంఫురాకార్బ్, థియోడికార్బ్, డికోఫోల్ వంటి ప్రమాదకర పురుగుమందులను నిషేధించవచ్చునని తెలిపింది. అయినప్పటికీ, మిగిలిన పురుగుమందులు మధ్యస్తంగా ప్రమాదకరంగా పేర్కొన్నారు. నిర్మాణాత్మక నియంత్రణ, నిల్వ, మిడుతల నియంత్రణ, తక్కువ ఖర్చు ఉన్నందున అస్ఫేట్, క్లోర్‌పైరిఫోస్, డెల్టామెత్రిన్, డైమెథోయేట్, క్వినాల్‌ఫోస్, మలాథియాన్, కెప్టన్, కార్బెండజిమ్, మాంకోజెబ్, తిరామ్, జినెబ్ ,జిరామ్ రసాయనాల నిషేధంపై పునఃపరీశలన అవసరం అని పేరొకంది. ప్రత్యామ్నాయ రసాయనాలను సిఫారసు చేసే వరకు సవరించిన నోటిఫికేషన్ జారీ చేయాలని నిపుణులు స్పష్టం చేశారు.

పనులు ప్రారంభం కాకుండానే 100 కోట్లు పెరిగింది

Tags: Disagreements over pesticide ban

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *