Date:08/05/2020
చౌడేపల్లి ముచ్చట్లు:
చౌడేపల్లి మండలం లోని పుదిపట్ల పంచాయతీ అమర కృష్ణాపురం, కాకతి పంచాయతీ మరి మా కుల పల్లి ఈ రెండు పల్లెల్లో శుక్రవారం ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ప్రపంచాన్ని సైతం కరో నా మహమ్మారి ప్రజలను అతలాకుతలం చేస్తున్న విషయం తెలిసిందే. చిత్తూరు జిల్లాలో పడమటి ప్రాంతాలైన మండలాలలో ఒక్కసారిగా మదనపల్లి ప్రాంతంలో గురువారం కరోనాపాజిటివ్ కేసు నమోదైన విషయం తెలిసిందే.ఆ వ్యక్తిని ఎదురు గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ చెన్నై కోయంబేడు మార్కెట్ నుంచి అతన్ని పుంగనూరు కు తీసుకొచ్చాడు.అతను చాలా సేపు పుంగనూరులో వేచి ఉండడం అక్కడ నుంచి పుదిపట్ల పంచాయతీ కృష్ణాపురం గ్రామానికి చెందిన ఓ ఓ యువకుడికి చెందిన మోటార్ బైక్ పై ప్రయాణం చేసినట్లు పోలీసులు గుర్తించారు.
అతనికి పాజిటివ్ టాక్ రావడంతో వైద్యులు పోలీసులు ఆ వ్యక్తి నుంచి ప్రైమరీ కాంటాక్ట్ వివరాలను సేకరించే పనిలో పడ్డారు.ఇందులో భాగంగా అధికారులు వైద్య సిబ్బంది ఈ రెండు గ్రామాలకు వెళ్లి విషయం తెలియజేయడంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడి భయభ్రాంతులకు గురయ్యారు.శుక్రవారం ఎంపీడీవో శంకరయ్య డాక్టరు పవన్ కుమార్ ఎ ఎస్ ఐకృష్ణమోహన్ లా ఆధ్వర్యంలో ఆ రెండు పల్లెల్లోనూ పారిశుద్ధ్య పనుల తో పాటు, ద్రావణాలను పిచికారీ చేయించారు.ఆ వ్యక్తితో సన్నిహితంగా తిరిగిన వారి వివరాలను సేకరించి వారికి అవగాహన కల్పించారు.అలాగే మరి మా కుల పల్లి లో డ్రైవర్ తో పాటు అతని కుటుంబ సభ్యులు ఐదు మందిని మదనపల్లె తాసిల్దార్ మురళి ఆధ్వర్యంలో తరలించడం జరిగింది.
ఒక్కసారిగా పాజిటివ్ కేసులు నమోదు గ్రామాల్లో అధికారుల సందర్శన హడావుడి చూసిన ప్రజలు ఏ సమయానికి వార్త వినాల్సి వస్తుందో ఏం జరుగుతుందోనని భయపడుతున్న డం గమనార్హం.అధికారులు మాత్రం ప్రజలు లడ్డు నియమ నిబంధనలు పాటించాలని మాస్కు ధరించాలని భౌతిక దూరం పాటించాలని సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మహమ్మద్ ఆజాద్, వసుంధర తదితరులు పాల్గొన్నారు.
ప్రజలను చైతన్య పరుచడంలో పాటలే కీలకం
Tags: Two Pallies in Fear Guppet