https://www.telugumuchatlu.com/the-cost-of-the-lok-sabha-elections-is-now-rs-77-lakh/

నవమి వేడుకల్లో పూలు, ఆకులతో అలంకారం

Date:20/10/2020

పుంగనూరు ముచ్చట్లు:

నవరాత్రి వేడుకల్లో భాగంగా నాల్గవ రోజు వివిధ ఆలయాలలో ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. మంగళవారం పట్టణంలోని బస్టాండులో గల శ్రీ విరూపాక్షి మారెమ్మను వేప ఆకు, పూలతో అలంకరించారు. అలాగే పట్టణంలోని బజారువీధిలో గల శ్రీ వాసవి కన్యాకాపరమేశ్వరి అమ్మవారిని ప్రత్యేకంగా అలంకారించారు. అలాగే బోగనంజుండేశ్వరిస్వామి ఆలయంలో గల పార్వతిదేవికి, తూర్పుమొగశాలలో గల చాముండేశ్వరిదేవిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. వీటితో పాటు పట్టణ సమీపంలోని మాదనపల్లెలో శ్రీషిరిడిసాయిబాబాను , చెరువు కట్టపైన, కొత్తయిండ్లలో గల సాయిబాబా ఆలయంలో కూడ ప్రత్యేక పూజలు చేశారు. ఆలయాలలో దసరా పూజలు సందర్భంగా ఆలయాలను విద్యుత్‌ దీపాలతో అలంకరించి, వేకువజాము నుంచి పూజలు, హోమాలు , అభిషేకాలు నిర్వహించారు. నవరాత్రి ఉత్సవాలు సందర్భంగా ఆలయాలు భక్తులకు కిటకిటలాడింది. భక్తులకు ఆలయ ధర్మకర్తలు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.

లోక్​సభ ఎన్నికల వ్యయం ఇకపై రూ.77 లక్షలు

Tags: Decorate with flowers and leaves for Navami celebrations

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *