Women need to grow financially

మహిళలకు ఆసరా అండగా నిలిచింది

– వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి

Date:16/09/2020

పుంగనూరు ముచ్చట్లు:

వైఎస్‌ఆర్‌ ఆసరా పథకం మహిళలకు అండగా తోడ్పాటునందిస్తోందని వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి అన్నారు. బుధవారం మండల ఎంపీపీ అభ్యర్థి అక్కిసాని భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్‌ఆర్‌ ఆసరా వారోత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్దిరెడ్డి అతిధిగా హాజరై మహిళలకు చెక్కులను పంపిణీ చేశారు. అలాగే ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిధున్‌రెడ్డిల చిత్రపటాలకు మహిళలతో కలసి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో సీఎం ఇచ్చిన హామి మేరకు మహిళల రుణాలను రద్దు చేయడం జరిగిందన్నారు. మంత్రి పెద్దిరెడ్డి సూచనల మేరకు మండలంలో 964 గ్రూపులకు రూ.8.2 కోట్లు రుణమాఫి నిధులు ఖాతాల్లో జమకాబడిందన్నారు. వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం నవరత్నాల పేరుతో అందిస్తున్న సంక్షేమ పథకాలతో రాష్ట్రంలోని ప్రతి ఇంటిలోని కుటుంబ సభ్యులు లబ్ధిచెందుతున్నారన్నారు. రాష్ట్ర చరిత్రలో ఇన్ని సంక్షేమ పథకాలు అందించిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు విజయభాస్కర్‌రెడ్డి, ఆర్టీసి మజ్ధూర్‌ అధ్యక్షుడు జయరామిరెడ్డి, పార్టీ జిల్లా కార్యదర్శి చంద్రారెడ్డి యాదవ్‌, మాజీ ఎంపీపీ నరసింహులు, మాజీ మండల ఉపాధ్యక్షుడు రామచంద్రారెడ్డి, మాజీ సీడిసీఎంసీ చైర్మన్‌ దేశిదొడ్డి ప్రభాకర్‌రెడ్డి, పార్టీ నాయకులు ఖాదర్‌బాషా, రాజశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మహిళలు ఆర్థికంగా ఎదగాలి  

Tags: Women need to grow financially

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *