పుంగనూరులో భారీ బందోబస్తు

Huge Bandobastu in Punganur

Huge Bandobastu in Punganur

Date:09/11/2019

పుంగనూరు ముచ్చట్లు:

దశాబ్దాల తరువాత రామజన్మభూమి స్థల విషయంలో సుప్రీంకోర్టు శనివారం తీర్పు వెలువరించింది. ఈ నేపధ్యంలో పట్టణంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండ సీఐలు గంగిరెడ్డి, మదుసూధనరెడ్డి ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పట్టణంలోని జాతీయ రహదారిపైన, పట్టణ కూడలీ ప్రాంతాలలోను పోలీస్‌ పికెట్లు ఏర్పాటు చేసి, ప్రజలను , పార్టీ నాయకులను, ముస్లిం నేతలను శాంతియుత వాతావరణంలో ఉండాలని, ఎలాంటి చట్టవ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డవద్దంటు పోలీసులు సూచిస్తూ హెచ్చరికలు చేశారు. ఉదయం నుంచి ఈ బందోబస్తు కార్యక్రమాలను కొనసాగిస్తుంటామని తెలిపారు. కాగా ఎలాంటి సంఘటనలు లేకుండ ప్రజలు సహకరించడంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. ఈ పహారలో ఎస్‌ఐలు రవికుమార్‌, తిప్పేస్వామి, పోలీసులు పాల్గొన్నారు.

రైతు భరోసా స్పందనకు 551 వినతులు

Tags: Huge Bandobastu in Punganur

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *