చెన్నై ఎయిర్ పోర్ట్ లో భారీగా డ్రగ్స్ పట్టివేత.

తమిళనాడు  ముచ్చట్లు:

టాంజానియా జాతీయుడి వద్ద 8.86 కోట్ల విలువ చేసే 1.266 కేజీల హెరాయిన్ సీజ్ చేసిన కస్టమ్స్ అధికారులు.1.26 కేజీల హెరాయిన్ ను క్యాప్సూల్ లో నింపి పొట్ట లో దాచిన కేటుగాడు.ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 86 క్యాప్సూల్ ను మింగి సౌత్ ఆఫ్రికా లో విమానం ఎక్కిన ప్రయాణీకుడు.అచ్చం సినీ ఫక్కీలో డ్రగ్స్ తరలించే యత్నం చేసిన టాంజానియా జాతీయుడు.చెన్నై ఎయిర్ పోర్ట్ ఆరైవల్స్ వద్ద కుప్పకూలి పడిపోయిన ప్రయాణీకుడు. హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు.శస్త్రచికిత్స అనంతరం కడుపులో దాచిన డ్రగ్స్ ను బయటకు తీసిన వైద్యులు.డ్రగ్స్ సీజ్…….ప్రయాణీకుడి జోసెఫ్ పై NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న కస్టమ్స్.ఆఫ్రికా నుండి హెరాయిన్ ను ఎవరి కోసం తెస్తున్నారు అనే సమాచారాన్ని కూపి లాగుతున్న అధికారుల బృందం.

 

Tags: Huge drug bust at Chennai Airport.

Leave A Reply

Your email address will not be published.