అండర్ 12,14 ఫుట్ బాల్ సెలెక్షన్స్ కు భారీ స్పందన

జిల్లా నలుమూలల నుండి తరలివచ్చిన క్రీడాకారులు

Date: 09/12/2019

ఎమ్మిగనూరు ముచ్చట్లు:

ఎమ్మిగనూరులో మినీ ఫుట్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్ 12,14 క్రీడాకారుల ఎంపికకు కర్నూలు జిల్లా వ్యాప్తంగా భారీగా క్రీడాకారులు తరలివచ్చారు. రెండు విభాగాల్లో దాదాపు 220 మంది పాల్గొన్నట్లు నిర్వాహకులు తెలిపారు.క్రీడా పోటీలను స్థానిక ఫుట్ బాల్ కోచ్ మాబుసాబ్ వైసీపీ లీడర్ శ్రీనివాస రెడ్డిలు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా మినీ ఫుట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షులు విశ్వనాథ్ రమేష్ మాట్లాడుతూ క్రీడాకారులు జిల్లాకు మంచిపేరు తెచ్చేలా ఆటలో సత్తా చాటాలన్నారు.ఎంపికైన క్రీడాకారులు ఈనెల 15,16 వ తేదీల్లో చిత్తూరు జిల్లా పుత్తూరులో జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.కార్యదర్శి నరసింహ రాజు మాట్లాడుతూ  ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 14వ తేదీ అర్హత పత్రంతో రావాలని అన్నారు.ఈ కార్యక్రమంలో పి.ఈ.టీలు ఈరన్న,శ్రీనివాసులు,అనీఫ్,శ్రీరామ్,భరత్(బ్యాంక్ ఆఫ్ బరోడా) తదితరులు పాల్గొన్నారు.

 

డిసెంబ‌రు 10న శ్రీ తిరుమంగై ఆళ్వార్ సాత్తుమొర‌

 

Tags:Huge exposure to under-12,14 football selections

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *