కడపలో భారీ అగ్నిప్రమాదం
కడప ముచ్చట్లు:
కడప మండీల బజార్లోని వెంకటేశ్వర ట్రేడర్స్ దుకాణంలో గురువారం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. దుకాణం యజమాని బద్రీనాథ్ బుధవారం రాత్రి 10 గంటలకు తన దుకాణం మూసేసి ఇంటికి వెళ్లారు. గురువారం వేకువజామున సుమారు 3 గంటల ప్రాంతంలో దుకాణంలో నుంచి దట్టమైన పొగలు రావడంతో స్థానికులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది షట్టర్లను పగలగొట్టి..కొన్ని గంటలపాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. మూడంతస్తుల భవనంలో మొత్తం నిత్యావసర వస్తువులు ఉండటంతోపాటు నూనె సామగ్రి ఎక్కువగా ఉండడంతో మంటలు క్షణాల్లో వ్యాపించాయి. ఈ ప్రమాదంలో 2 కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితుడు తెలిపారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగినట్లు అనమానిస్తున్నారు.
Tags: Huge fire in Kadapa

