సాగర్ లో భారీ బందోబస్తు

నల్లగొండ  ముచ్చట్లు:

శ్రీశైలం వద్ద విద్యుత్ ఉత్పత్తి విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య తలెత్తిన వివాదం జల రగడ కు దారి తీసేలా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో నే నల్గొండ జిల్లా పోలీసులు అలర్ట్ అయ్యారు. ముందస్తు జాగ్రత్తగా నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సివిల్ పోలీసులతో పాటు స్పెషల్ పార్టీ బలగాలు మోహరించాయి. సాగర్ పరివాహక ప్రాంతం మొత్తం పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. డ్యామ్ పరిసర ప్రాంతాలకు ఎవరూ చేరుకోకుండా కట్టడి చేస్తున్నారు. మరోవైపు రేపో మాపో సాగర్ కుడి, ఎడమ కాల్వలకు సాగు నీరు విడుదల చేయాల్సి ఉండగా…. తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలు ఎటు వైపు దారి తీస్తాయోనన్న ఆందోళన ఆయకట్టు రైతుల్లో నెలకొంది.

 

పుంగనూరులో పనిచేస్తున్న మాదవరాజుకు తహశీల్ధార్‌గా పదోన్నతి

Tags:Huge provision in Sagar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *