జీఎస్టీ అమ‌లుతో భారీగా త‌గ్గిన ప‌న్నులు: కేంద్ర ఆర్థిక‌ శాఖ‌

న్యూఢిల్లీ ముచ్చట్లు:
దేశంలో జీఎస్టీ విధానం అమ‌ల్లోకి వ‌చ్చిన త‌ర్వాత వ‌స్తు, సేవ‌ల‌పై ప‌న్నులు భారీగా త‌గ్గాయ‌ని కేంద్ర ఆర్థిక‌శాఖ ప్ర‌క‌టించింది. జీఎస్టీకి ముందు హెయిర్ ఆయిల్‌, టూత్ పేస్ట్‌, స‌బ్బులపై 29.3 శాతం ప‌న్ను వ‌సూలు చేసేవార‌ని, జీఎస్టీ కార‌ణంగా ఇప్పుడ‌వి 18 శాతం ప‌న్ను ప‌రిధిలోకి వ‌చ్చాయ‌ని ఆర్థిక శాఖ పేర్కొన్న‌ది. అదేవిధంగా గృహోప‌క‌ర‌ణాలు, వాషింగ్ మెషిన్‌లు, వ్యాక్యూమ్ క్లీనర్‌లు, టీవీల‌పై ప‌న్ను రేట్లు కూడా 31.3 శాతం నుంచి 18 శాతానికి త‌గ్గిన‌ట్లు తెలిపింది.జీఎస్టీకి ముందు సినిమా టికెట్ల‌పై 35 శాతం నుంచి 110 శాతం వ‌ర‌కు ప‌న్నులు వ‌సూలు చేసేవార‌ని, టికెట్ ధ‌ర రూ.100 కంటే త‌క్కువ ఉన్న చోట్ల ప‌న్ను 12 శాతానికి త‌గ్గింద‌ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. ఓవ‌రాల్‌గా 400 ర‌కాల వ‌స్తువులు, 80 ర‌కాల సేవ‌ల‌పై ప‌న్ను త‌గ్గింద‌ని ఆర్థిక శాఖ తెలిపింది. ఈ త‌గ్గింపుతో ప‌న్ను చెల్లింపుదారుల‌కు భారీ ఊర‌ట ల‌భించింద‌ని పేర్కొన్న‌ది.

 

పుంగనూరులో పనిచేస్తున్న మాదవరాజుకు తహశీల్ధార్‌గా పదోన్నతి

Tags:Huge reduction in taxes with the implementation of GST: Central Finance Department

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *