-రోడ్లు వేయకుండానే వేసినట్లు రూ.25 లక్షలు స్వాహా
కేవీబీపురం ముచ్చట్లు:
రెండు గిరిజన కాలనీ లతొ పా టు, మరొ రెండు గ్రామాలకు అడవి బాట కల్పించినట్టు మరొ కుచ్చుటోపీ.ఆధరం to భోనుపల్లి గిరిజన కా లనీల మధ్యలో ఉన్న తెలుగు గంగ కాలువ,కాలంగి వాగు మీద కూడా మట్టి రోడ్డు వేసేసినట్టు బి ల్లులు కొల్లగొట్టిన అపర మేధావు లు.గత MPDO రామచంద్రకు తెలి సే అక్రమంగా బిల్లులు కాజేసిన వైనం.మట్టి రోడ్లు,బోరు మోటార్ల ఏ ర్పాటులో భారీ అవినీతి.గిరిజన కాలనీలకు మార్గాలు కల్పించకుండా లక్షల రూపాయ లు పక్కదారి పట్టించిన ఆనేత, అధికారిపై కలెక్టర్కు ఫిర్యాదు చే యనున్న హ్యూమన్ రైడ్స్ స భ్యులు.అవినీతిపై విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేస్తున్న బహుజన సమాజ్ పార్టీ.మండలంలో గత మూడేళ్లుగా జరి గిన మట్టిరోడ్లు, బోరు మోటార్ల ఏ ర్పాటు వంటి అభివృద్ధి పనుల్లో భా రీ కుంభకోణం వెలుగులోకి వచ్చిం ది.రోడ్డుమార్గాలు లేక ఇబ్బందులు పడుతున్న కొన్ని గిరిజన కాలనీల ను అభివృద్ధి చేయాల్సిన ఒక నేత,అభికారి, మరొక క్షేత్ర స్థాయి కాం ట్రాక్ట్ ఉద్యోగి గిరిజన కాలనీలకు అన్యాయం చేయడమే కాకుండా,ఆయా గ్రామాలకు రోడ్లు కల్పించిన ట్లు తప్పుడు సాక్ష్యాలు సృష్టించిరూ.25 లక్షల వరకు మెసేయడంచర్చగా మారింది.గ్రామాలల్లో వేసిన ఒక బోరుకు మూడు దఫాలుగా బిల్లులు ఆరగించేసారు. ఈ విషయంపైపక్కా ఆధారాలతో జాతీయ మానవహక్కుల కమిషన్ నేడు జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేయనుంది.
Tags: Huge scam in KVBIpuram Mandal.