Natyam ad

అయోధ్యలో భారీ వీణ

లక్నో ముచ్చట్లు:

త్తరప్రదేశ్‌లోని అయోధ్యలోని ప్రముఖ కూడలిలో 14 టన్నుల బరువున్న 40 అడుగుల వీణ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈరోజు ఆమె 93వ జయంతి సందర్భంగా ప్రముఖ గాయని లతా మంగేష్కర్‌కు నివాళులర్పిస్తూ దీనిని ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డితో కలిసి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ లతా మంగేష్కర్ చౌక్‌ను వాస్తవంగా ప్రారంభించనున్నారు. లతా మంగేష్కర్ ఈ ఏడాది ఫిబ్రవరి 6న ముంబై ఆసుపత్రిలో మరణించారు.అయోధ్యలోని సరయూ నది తీరంలో లతామంగేష్కర్‌ చౌక్‌లో అత్యంత భారీ వీణను ఏర్పాటు చేశారు. భారత శాస్త్రీయ సంగీత పరికరమైన ఈ వీణ సైజు 40అడుగుల పొడవు, 14టన్నుల బరువు ఉంది. నోయిడాలో రూపు దిద్దుకున్న భారీ వీణను ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన సర్ధార్‌ వల్లభాయ్‌ పటేల్‌ విగ్రహ శిల్పి రామ్‌ వన్‌జీ సుతార్‌ తయారు చేశారు.ల‌త పుట్టడ‌మే సంగీత కుటుంబంలో పుట్టారు. ఆమె తండ్రి పండిట్ దినానాథ్ మంగేష్కర్ ఆ రోజుల్లో ప్రఖ్యాత సంగీత విద్వాంసులు. ఆయ‌న క‌చేరీలు అంటే దేశ‌నాయ‌కులు సైతం చెవికోసుకొనేవారు. తండ్రి వ‌ద్దనే సాధ‌న ఆరంభించిన ల‌త త‌రువాత సంగీతంలో అత్యున్నతంగా శిక్షణ తీసుకోవాల‌నుకున్నారు. కానీ, ఆమె ప‌సిత‌నంలోనే తండ్రి క‌న్నుమూశారు. ఐదుమంది సంతానంలో ల‌త అంద‌రిక‌న్నా పెద్ద. ఆశ‌, హృద‌య‌నాథ్, ఉష‌, మీనా ఆమె త‌రువాతి వారు.

 

 

Post Midle

కుటుంబ పోష‌ణ కోసం చిన్నత‌నంలోనే ల‌త కొన్ని చిత్రాల‌లో బాల‌న‌టిగా న‌టించారు. త‌రువాత పాట‌తో ప‌య‌నించారు. ఆమె గాత్రంలోని మాధుర్యం గ‌మ‌నించిన నౌష‌ద్, సి.రామ‌చంద్ర, ఎస్డీ బ‌ర్మన్, శంక‌ర్-జైకిష‌న్, హేమంత్ కుమార్, స‌లీల్ చౌద‌రి ఎంత‌గానో ప్రోత్సహించారు. త‌రువాతి త‌రం సంగీత ద‌ర్శకులు మ‌ద‌న్ మోహ‌న్ వంటివారు ల‌త పాట‌తోనే త‌మ ఉనికిని చాటుకున్నారు. అనేక చిత్ర విజ‌యాల‌కు ల‌త గానం తోడ‌యింది. సినిమా జ‌యాప‌జ‌యాలు ఎలా ఉన్నా ల‌త పాట‌కోసం సద‌రు చిత్రాల‌ను తిల‌కించిన వారు ఉన్నారు. ఇంత‌టి గాన‌వైభ‌వం ప్రద‌ర్శించిన ల‌త‌కు 1972లో ప‌రిచ‌య్ చిత్రంలో పాట‌ల‌కు తొలి నేష‌న‌ల్ అవార్డు ల‌భించింది.త‌రువాత 1974లో ఖోరా కాగ‌జ్, 1990లో లేకిన్ చిత్రాల ద్వారా మ‌రో రెండు సార్లు ఉత్తమ గాయ‌నిగా జాతీయ స్థాయిలో నిలిచారు. ఆమె కీర్తి కిరీటంలో అనేక అవార్డులూ, రివార్డులూ ర‌త్నాల్లా వెలుగొందుతూ ఉన్నాయి. ప‌ద్మభూష‌ణ్, ప‌ద్మవిభూష‌ణ్, దాదాసాహెబ్ ఫాల్కే, భార‌త‌ర‌త్న అవార్డులు అందుకుని గాన‌కోకిల‌గా త‌న‌దైన వైభ‌వం ప్రద‌ర్శించారు. 92 ఏళ్ల లతా కరోనా వల్ల అనారోగ్యంతో 29 రోజుల పాటు ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చికిత్స పొందతూ ఫిబ్రవరి 6న కన్నుమూశారు.

 

Tags: Huge veena in Ayodhya

Post Midle