భారీగా తగ్గిన శ్రీవారి హుండీ ఆదాయం

తిరుమల ముచ్చట్లు :

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి హుండీ ఆదాయం బాగా తగ్గింది. గతంలో ఈ రోజు రూ.10 కోట్లకు తగ్గకుండా హుండీ ద్వారా ఆదాయం లభించేది. కరోనా నేపథ్యంలో దర్శనాలు రద్దు చేయడంతో భక్తుల రాక బాగా తగ్గిపోయింది. కేవలం 300 రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు మాత్రమే ఇస్తున్నారు. గురువారం రోజు కేవలం 11,307 మంది భక్తులు మాత్రమే శ్రీవారిని దర్శించుకున్నారు. తద్వారా రూ. కోటి హుండీ ఆదాయం లభించింది. ఇటీవల కాలంలో వచ్చిన ఆదాయాల్లో ఇదే అతి తక్కువ కావడం గమనార్హం.

 

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

Tags:Hugely reduced Srivari hundi income

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *