మానవ మృగం శ్రీనివాస్ రెడ్డి ని కూడా ఎన్కౌంటర్ చేయాలి…

Date:07/12/2019

యాదాద్రి ముచ్చట్లు:

హాజీపూర్ వరస హత్యల నిందితుడు మానవ మృగం మర్రి శ్రీనివాస్ రెడ్డి ని కూడా ఎన్ కౌంటర్ చేయాలని హాజిపూర్ గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. షాద్ నగర్ లో దిశ రెడ్డి పై అత్యాచారం ఆపై హత్య చేసిన నిందితులను ఎన్ కౌంటర్ చేసిన పోలీసులు షాదనగర్ దగ్గర సీన్ రివర్స్ చేస్తున్న సమయంలో పారిపోతుండగా పోలీసులు కాల్పులు జరపగా  ఆ కాల్పులల్లో  అక్కడికక్కడే మృతి చెందిన నలుగురు నిందితుల మాదిరిగానే మానవ మృగాన్ని కూడా ఎన్కౌంటర్ చేయాలని హాజిపూర్ గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. షాద్ నగర్ ఘటన జరిగిన తొమ్మిది రోజుల్లోనే నిందితులను ఎన్కౌంటర్ లో మట్టుబెట్టిన ప్రభుత్వం హాజిపూర్ ఘటన ను  ఎందుకు సీరియస్ గా తీసుకోవడం లేదని ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యే కనీసం చట్ట సభల్లో ఈ విషయాన్ని గూర్చి మాట కూడా ఎత్తడం లేదని శ్రీనివాస్ రెడ్డి తమ తెరాస  పార్టీ కి చెందిన వాడు కనుకనే కాపాడే ప్రయత్నం చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు,కేటీఆర్ ట్విట్టర్ పిట్ట గా కేవలం ట్విట్టర్ లో స్పందించి బాధిత న్యాయం చేస్తామని తెలిపి ఇప్పటి వరకు కనీసం బాధిత కుటుంబాలను పరామర్శించిన పాపాన పోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

రామగుండం పోలీసుల గ్రీన్ ఛాలెంజ్

 

Tags:Human beast Srinivas Reddy must also encounter …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *