కంప్యూటర్ తో తగ్గిపోతున్న మానవ సంబంధాలు: గవర్నర్ నరసింహన్

Human Relationships With Computer: Governor Narasimhan

Human Relationships With Computer: Governor Narasimhan

 Date:21/09/2018
హైదరాబాద్  ముచ్చట్లు:
కంప్యూటర్ రాకతో మానవ సంబంధాలు తగ్గిపోతున్నాయని గవర్నర్ నరసింహన్ అన్నారు. నేడు వరల్డ్ అల్జీమర్స్ డే. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ హైటెక్‌సిటీలో వరల్డ్ అల్జీమర్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. రెడ్‌క్రాస్ సొసైటీ, నైట్‌ఎంజిల్ ట్రస్టు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్ దంపతులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. శాస్త్ర సాంకేతిక వల్ల ఆలోచనా శక్తి కోల్పోతున్నారన్నారు. పాఠశాలల్లో పిల్లలు కనీసం ప్రార్థన కూడా సొంతంగా పాడలేని స్థితిలో ఉన్నారు. కొన్ని పాఠశాలల్లో ఐపాడ్ చూస్తూ ప్రార్థన చేయడం బాధాకరమన్నారు. తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో చేర్చొద్దని.. ఇంటి దగ్గరే వారిని సంరక్షించుకోవాలని పేర్కొన్నారు.
Tags:Human Relationships With Computer: Governor Narasimhan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *