Pleasant atmosphere in Tirumala

పెనుప్రమాదంలో మానవ మనుగడ

Date:28/03/2020

విజయవాడ ముచ్చట్లు:

గడపదాటితే గుటుక్కే.ప్రపంచమంతా కరోనా కరాళనృత్యం చేస్తుంది.అమెరికాలో నియంత్రణ లేని మృత్యుఘూష.యుద్దంలో అమెరికాను జయించిన చిన్న దేశం వియత్నాం కరోనా పై కూడా పై చేయి సాధించింది.చైనా సరిహద్దుగల వసతులు లేని చిన్న దేశం జనవరి1నుండే లాక్ డౌన్ ప్రకటించి ఉక్కుసంకల్పంతో ఒక్క మరణం కూడా నమోదు కాకుండా చూడగలిగింది.పాజిటివ్ కేసులు కూడా 200లోపే.ఏలా సాధ్యమైంది అంటే స్వీయనియంత్రణ,వ్యక్తిగత క్రమశిక్షణే కరోనాను జయించే ఆయుధాలుగా వియత్నామీయులు మలచుకున్నారు.

 

కరోనా మహమ్మారిని తక్కువ అంచనా వేసిన 35కోట్లు జనాభా కలిగిన అమెరికా పేకమేడలా కూలుతున్నది.అగ్రరాజ్యం అంటు వ్యాధులలో కూడా అగ్రపథాన పయనిస్తుంది.కొత్త కేసులు,మరణాలు గణనీయంగా పెరుగుతున్నాయి.అమెరికా సంయుక్తరాష్ట్రాలలో 50రాష్ట్రాలలో కేసుల పాజిటివ్ కేసుల కంటే ఒక్క న్యూయార్క్ లో నియంత్రణ చేయుట దుర్లభంగా మారింది.ఈ దుస్థితికి ట్రంప్ అహంకార పూరిత విధానాలే కారణమంటున్నారు.

 

 

 

కాని ఇండియా,చైనా,రెండు కొరియాలు,రష్యా,జపాన్ తడబడి నిలబడుతున్నాయి.ఇండియా స్వీయనియంత్రణ పాటించుట,ప్రభుత్వ చర్యలు సానుకూలంగా ఉండుట వలన పరిస్థితి నియంత్రణలో ఉన్నట్లు అనిపిస్తున్నది.బ్రిటన్ అయితే ఏకంగా రాజు,ప్రధానమంత్రే వ్యాధిబారిన పడ్డారు.యూరోప్ మొత్తం గడగడలాడుతుంది.ఇటలీ,స్పెయిన్ ,స్వీడన్ ల పరిస్థితి కడు దయానీయం.ఆసియాలో ఇరాన్ ,పాకిస్తాన్ ,ఇతర అరబ్ దేశాలలో మరణాలు అధికమౌతున్నాయి.అధిక ఉష్ణోగ్రతలు,ఇమ్యునిటి ఉన్న ఆఫ్రికా దేశాలలో ఇంకా ఎంట్రీలేదు.ఇప్పటికి199 దేశాలు ప్రభావితం అయ్యాయి.కేసులు 5లక్షల32వేల224 సమీపిస్తున్నాయి.మరణాలు 24వేలు పైగా నమోదు అయి శర వేగంగా పెరుగుతున్నాయి.

 

భారత్ లో లాక్ డౌన్ వలన కొంత వరకు సంఖ్యలు పెద్దగా పెరగడంలేదు.ప్రస్తుతం 727పాజిటివ్ తేలాయి.దాదాపు15లక్షల మంది జనవరి నుండి మార్చి23వరకు విదేశాలనుండి వచ్చారు.వారిలో కొంతమంది జాడలేదు.చైనా,ఇటలీ,స్పెయిన్ ,బ్రిటన్ ,అమెరికా లా మన దేశంలో కరోనా పడగవిప్పితే దాదాపు కోట్ల మందిని ప్రభావితం చేయవచ్చు.భారత్ కు రాబోయే రోజులు చాలా కీలకం.మరణాలు లక్షల్లో ఉండవచ్చు.అయితే మనకు పరీక్షచేసే కిట్లు మరియు అంతవేగంగా పరీక్షఫలితాలు రానందున కేసులు బయటపడుటలేదు అంటున్నారు.ఎవ్వరైతే సామాజిక దూరం పాటించి వ్యక్తిగత క్రమశిక్షణ పాటిస్తారో వాళ్ళే విజేతలు.మే31కి ఎవరు మిగులుతారో అదే తుది జనాభా లెక్క

అయితే మన దేశంలో అదుపు చేయగలం అనడానికి కొన్ని

1.భారతీయులకు శుచి,శుభ్రత ఎక్కువ
2.బాగా ఉడికిన పదారర్థాలే భుజించుట(ముఖ్యంగా మంసాహారం)
3.సహజ ఇమ్యునిటి యూరోప్ ,అమెరికా కంటే ఎక్కువ
4.తేమ తక్కువ.ఉష్ణోగ్రతలు మార్చి నుండి దాదాపు ఆగఘ్టు వరకు 32డిగ్రీల పైనే ఉండుట
పై కారణాలతో పాటు లాక్ డౌన్ లో స్వీయ నియంత్రణ పాటిస్తే 3వ దశ ప్రభావం చాలా తగ్గుతుంది.ఓ వేళ వ్యాధిబారిన పడినా మరణం కంటే రికవరి అవకాశాలు మెండు.130కోట్ల జనాభా గల మన దేశంలో వ్యాధి విజృంభిస్తే వైద్యసేవలు కష్టం.లాక్ డౌన్ పొడిగించవచ్చు.పనిలేనివాళ్ళు నియంత్రణ లేకుండా రోడ్ పైకి వస్తే దేశం మిలటరీ నియంత్రణలోకి వెళ్ళవచ్చు.అందుకే స్వీయ నియంత్రణ, వ్యక్తిగత క్రమశిక్షణ పాటిస్తేనే మిగులుతాం.కరోనా ఫై మానవ మనుగడకోసం జరిగే పోరాటం విజయం సాధిస్తామని ఆశిద్థాం.

ఇక ఇంటి నుంచే బాబు

Tags: Human survival in peril

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *