మానవ హక్కులపై మండిపడుతున్ననెట్ జన్లు

Date:07/12/2019

హైదరాబాదు ముచ్చట్లు:

సంచలనం రేపిన వెటర్నరీ డాక్టర్ దిశ హత్యకేసు నిందితుల ఎన్‌కౌంటర్ సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మానవహక్కుల సంఘాల నేతలు తెలంగాణ పోలీసులపై మండిపడుతున్నారు.. కొందరు పోలీసులపై కేసులు పెట్టారు. హైదరాబాద్‌, తెలంగాణతో పాటూ మిగిలిన కొన్ని రాష్ట్రాల్లో సామాజిక వేత్తలతో పాటూ నేషనల్ అలయన్స్ ఆఫ్ పీపుల్ మూమెంట్స్ పోలీసులపై మానవహక్కుల ఉల్లంఘన అంటూ ఈ కేసులు వేసినట్లు తెలుస్తోంది.
ఇలా తెలంగాణ పోలీసులపై పేరుతో హడావుడి చేస్తున్న వారిపై నెటిజన్లు జనాలు మండిపడుతున్నారు. నెటిజన్లు సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోస్తున్నారు. వీళ్ళు అన్యాయం జరిగినప్పుడు బయటకు రారు.. వచ్చినా సమస్యను పరిష్కరించే దిశగా మాట్లాడరు అంటున్నారు. సమస్యను పెంచటానికి వస్తారని.. న్యాయం జరిగినాక వచ్చి దానిలొ లొసుగులు కనిపెట్టి పబ్లిసిటీ వెతుక్కుంటారంటూ తీవ్ర ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి.సమాజంలో ఎవరికైనా అన్యాయం జరిగినప్పుడు.. వీళ్లంతా ఎందుకు జరిగిందని బయటకు రారు.. కానీ న్యాయం జరిగాకా వచ్చి నాలుకలాడిస్తారని ప్రజలే వీళ్ళకి బుద్ధి చెప్పేరోజు దగ్గర్లో ఉందంటూ మండిపడుతున్నారు. ఇలాంటి వచ్చినా కులాలను బట్టి మతాలను బట్టి ప్రజల మధ్య కుంపట్లు పెడతారంటూ నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు.

 

వాళ్లను కాల్చి చంపండి : ఉన్నావ్ కుటుంబసభ్యుల డిమాండ్

 

Tags:Humans are burning on human rights

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *