పుంగనూరులో శ్రీబోగనంజుండేశ్వరస్వామి హుండీ లెక్కింపు
పుంగనూరు ముచ్చట్లు:
పట్టణంలోని శ్రీబోగనంజుండేశ్వరస్వామి హుండీ లెక్కింపు కార్యక్రమం శనివారం ఉదయం ఏసీ ఏకాంబరం ఆధ్వర్యంలో ఈవో కమలాకర్ నిర్వహించారు. రూ.71,603 వేలు ఆదాయం లభించింది. ఈవో మాట్లాడుతూ ఏసీ ఆదేశాల మేరకు ఆలయానికి చెందిన 18 రూములను వేలం పాటలు నిర్వహిస్తామన్నారు. అలాగే గుడిని అన్ని విధాల అభివృద్ధి చేస్తూ పటిష్టంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ శశికుమార్, జూనియర్ అసిస్టెంట్ రమణ, అర్చకులు మంజు తదితరులు పాల్గొన్నారు.
Tags: Hundi counting of Sri Bogananjundeswaraswamy at Punganur

