ఆన్లైన్ ఆప్ వేధింపులకు భార్య భర్తలు మృతి
రాజమండ్రి ముచ్చట్లు:
రాజమండ్రి ఆనందనగర్ పేపర్ మిల్లు వద్ద నివాసముంటున్న కోటిపల్లి దుర్గారావు లక్ష్మీ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. గతంలో దుర్గారావు ఆన్లైన్ యాప్ లో 50,000 లోన్ తీసుకున్నాడు. లోన్ సమయానికి కట్టలేకపోవడం తో యాప్ నిర్వహకులు బెదిరింపులకు దిగారు. లోన్ కట్టకపోతే మీ ఫేస్ మార్ఫింగ్ చేసి న్యూడ్ ఫోటోలు ఆన్లైన్లో పెడతామని బెదిరింపులకు పాల్పడ్డారు. మనస్థాపం చెందిన భార్యాభర్తలిద్దరూ సాయి కృష్ణ రివ్యూ లాడ్జిలో పురుగులు ముందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. మృతుల సొంత ఊరు రాజువమ్మంగి మండలం లబ్బర్తి గ్రామం. ఐదేళ్లుగా రాజమండ్రిలో దుర్గారావు నివాసు ఉంటూ పెయింటర్ గా పనిచేస్తున్నాడు. టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Tags: Husband and wife died due to online harassment

