Natyam ad

పుంగనూరులో హత్యకేసులో భర్తకు జీవితఖైది

పుంగనూరు ముచ్చట్లు:

ఓ వివాహితతో సహజీవనం సాగించి ఆమె భూమి అమ్మిన డబ్బులు కాజేసి అడిగినందుకు సుత్తితో తలపగులగొట్టి హత్య చే సిన కేసులో వ్యక్తికి జీవితఖైదు, రూ.1000 లు జరిమానాను మదనపల్లె రెండవ అదనపు జిల్లా జడ్జి విధించింది. వివరాలిలా ఉన్నాయి. పుంగనూరు మండలం వెహోరుంపల్లె గ్రామంలో వెంకటప్ప భార్య పార్వతమ్మ నివాసం ఉండగా ఆమె భర్త వెంకటప్ప చనిపోవడంతో అదే గ్రామానికి చెందిన నారాయణ తో పరిచయం ఏర్పడి సహజీవనం చేసేది. ఇలా ఉండగా ఆమె కుటుంబ వ్యవహారాలు చూస్తున్న నారాయణ , పార్వతమ్మ భూమి డబ్బులు తీసుకున్నాడు. తిరిగి అడగడంతో నారాయణ కక్షకట్టి 2015 సంవత్సరంలో ఆమెను తన ఇంటిలోనే సుత్తితో తలపగులగొట్టి హత్య చేశాడు. ఈ కేసును పోలీసులు నమోదు చేసి నిందితున్ని అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. కేసు విచారణలో సీఐ గంగిరెడ్డి సాక్షులను పకడ్భంధిగా ప్రవేశపెట్టగా పిపి జనార్ధన్‌రెడ్డి వాగ్ములం ఇప్పించి కేసును రుజువుచేయడంతో జిల్లా అదనపు న్యాయమూర్తి భాస్కర్‌రావు జీవితఖైదు , రూ.1000 జరిమాన విధిస్తూ తీర్పు వెలువడించారు.

 

Post Midle

Tags: Husband sentenced to life in Punganur murder case

Post Midle