Husband threatens wife and three children

భర్త వేదింపులతో భార్య , ముగ్గురు పిల్లలు మృతి

– సీఐ గంగిరెడ్డి వెల్లడి

Date:22/03/2020

పుంగనూరు ముచ్చట్లు:

చెడు అలవాట్లకు బానిసైన భర్త వేదింపులు తాళలేక భార్య, ముగ్గరు పిల్లలను బావిలో వేసి తాను దూకి ఆత్మహత్య చేసుకున్నదని సీఐ గంగిరెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ శనివారం రాత్రి పుంగనూరు సమీపంలోని ప్రసన్నయ్యగారిపల్లె వద్ద వ్యవసాయ బావిలో నాలుగు మృతదేహాలను కనుగొన్నామన్నారు. వీటిపై దర్యాప్తు చేపట్టామన్నారు. దర్యాప్తులో భాగంగా అనేక విషయాలు వెలుగుచూశాయన్నారు. పుంగనూరు మేలుపట్లకు చెందిన ఓబులేసుతో కర్నాటక కాడేపల్లె గ్రామానికి చెందిన పద్మావతికి గత పది సంవత్సరాల క్రితం వివాహామైంది. వీరు సంచార జీవులు కావడంతో జీవనోపాధి కోసం పట్టణాలకు వెళ్లి గుడారాలు వేసుకుని జీవించేవారు. ప్రస్తుతం పలమనేరు పట్టణం పాలిటెక్నిక్‌ కళాశాల వద్ద గుడారాలలో నివాసం ఉన్నారు. ఇలా ఉండగా ఓబులేసు , అతని భార్య మారెమ్మ అనే పద్మావతి(30 ) దంపతులకు సంజయ్‌కుమార్‌ (6) ఒకటోతరగతి చదువుతున్నాడు. పవిత్ర (3), ఒకటన్నర సంవత్సరం పాపకు పేరు ఇంక పెట్టలేదు జన్మించారు. ఇలా ఉండగా ఓబులేసు చెడు అలవాట్లకు బానిసై, భార్యను తరచుగా కొట్టడం, వేదించడం చేసేవాడు. కానీ పద్మావతి ఎంతో ఓపికగా ఉంటు వ్యాపారంలో వచ్చిన ఆదాయంతో పిల్లలను పోషించుకుంటు ఉండేది. ఇలా ఉండ గత ఆదివారం పద్మావతి తన పిల్లలతో కలసి రామసముద్రం మండలం మినికి గ్రామంలో ఉన్న తన అమ్మమ్మ లక్ష్మమ్మ , అదే గ్రామంలో ఉన్న మేనేత్త ఆంజమ్మ ఇంటికి వెళ్లింది. మేనత్తకు , అమ్మమ్మకు భర్త వేదింపుల గూర్చి తెలిపింది. ఆంజమ్మ సూచనల మేరకు పద్మావతి తన పిల్లలను తీసుకుని గత మంగళవారం జాతర చూసుకుని పలమనేరులోని ఇంటికి వెళ్తానని చెప్పి బయలుదేరింది. మార్గ మధ్యంలో తీవ్ర మనస్థాపానికి గురైన పద్మావతి పలమనేరుకు వెళ్లి భర్త వేదింపులు తట్టుకుని జీవించలేక మరణించాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు పిల్లలను తీసుకుని పుంగనూరు పట్టణ సమీపంలోని బావి వద్దకు వచ్చి గుడ్డల బ్యాగును గట్టుపై పెట్టి, పిల్లలను బావిలోకి తోసి పద్మావతి కూడ దూకి ఆత్మహత్య చేసుకుని మరణించిందని సీఐ తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు భర్త ఓబులేసుపై కేసు నమోదు చేసి, కుటుంబ సభ్యులను విచారించి స్టేట్‌మెంట్లు రికార్డు చేశారు. నలుగురి శవాలను పోస్టుమార్టంకు తరలించి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామన్నారు. భర్త పరారీలో ఉన్నట్లు సీఐ తెలిపారు.

జనగణమనతో పుంగనూరుకు గుర్తింపు

Tags: Husband threatens wife and three children

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *