సొంత భార్య, కుమారుడిని హతమార్చిన భర్త

 Date:10/02/2019
మేడ్చల్ ముచ్చట్లు:
సొంత భార్య కుమారుడిని చంపి పెట్రోల్ పోసి నిప్పంటిచి తగులపెట్టిన సంఘటన మేడ్చల్ జిల్లా ఘాట్ కేసర్ మండలం కొండాపూర్ గ్రామంలో  జరిగింది. జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు గ్రామానికి చెందిన మచ్చల రమేష్ (27), వరంగల్ జిల్లా బొల్లికుంట గ్రామానికి చెందిన సుశ్రుత(26)లు 2015లో కులాంతర  ప్రేమ వివాహం చేసుకున్నారు.గత ఎనిమిది నెలల క్రితం ఇద్దరి మధ్య వివాదం నెలకొనడంతో భర్త తో  గొడవపడి సుశ్రుత తన తల్లిదండ్రుల వద్ద ఉంటుంది. నాలుగు నెలల క్రితం కుమారుడికి జన్మనిచ్చింది. కాగా శనివారం సాయంత్రం భర్తను కలిసేందుకు ఉప్పల్ వచ్చిన భార్యను బైక్ పై ఎక్కించుకుని ఘాట్ కేసర్ ఔటర్ రింగ్ రోడ్డు వద్దకు వచ్చారు. అక్కడ మళ్లీ గొడవ జరగడంతో సుశ్రుత తన వెంట తెచ్చుకున్న నిద్రమాత్రలు మింగటంతో పాటు మరో మాత్రను పౌడర్ గా చేసి పాలలో కలిపి కుమారునికి తాగించింది. దింతో నిద్ర మత్తులోకి జరుకోగా రమేష్ వారిని  బైక్ పై ఎక్కించుకుని హెచ్ పి సి ఎల్ కంపెనీ సమీపంలోని జాతీయ రహదారి పక్కనే ఉన్న ప్రభాకర్ ఎనక్లేవ్ లోకి తీసుకువెళ్లాడు. అక్కడ  ఊపిరి అడకుండా చేసి హత్య చేసాడు.  తరువాత పక్కనే ఉన్న పెట్రోల్ బంక్ నుండి పెట్రోల్ తీసుకు వచ్చి చుట్టూ పక్కల ఉన్న కట్టెలను వేసి నిప్పంటించి తగుల పెట్టాడు.   అనంతరం పాలకుర్తి వెళ్లి పోలీసులకు లొంగి పోయాడు.
Tags:Husband who killed his own wife and son

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *