భార్యపై ఉన్మాది లా మారిన భర్త

రాజానగరం ముచ్చట్లు:

 

తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలం పెద్ద కొండేపూడిలో ఒక భర్త  ఉన్మాదిలా మారి భార్యకు నరకం చూపించాడు. నిత్యం హింస పెట్టాడు. భార్య ఆశను భర్త కర్రి.అభిరామ్  ఒక గదిలో నిర్భంధించి దిండుతో హతమార్చడానికి ప్రయత్నించాడు. తాను  కొన ఊపిరితో తప్పించుకున్నానని  బాధితురాలు ఆశ మీడియాకు తెలియజేశారు. భర్త దాష్టికం పై భార్య పోలీసులను ఆశ్రయించగా ఆమెను పోలీసులు ఆస్పత్రికి తరలించారు.   ఆశాకు వివాహమై నాలుగు సంవత్సరాలు అయింది. వీరికి  ఒక బాలుడు ఉన్నాడు. గత మూడు సంవత్సరాల నుండి మామ, ఆడపడుచు, భర్త నానమ్మ వీరంతా ఏకమై చిత్ర హింసలకు గురి చేస్తున్నారని పిల్లాడి కోసం భరిస్తూ ఉన్నానని ఆశా  చెప్పుకుంటూ వచ్చారు. ఇటీవల కాలంలో మండలంలో పలువురు పెద్దల సమక్షంలో న్యాయం కోసం ఆశ్రయించగా బాగానే చూసుకుంటానని మాయమాటలు చెప్పి నెల్లూరు జిల్లా వాసినైన బీసీ మైనార్టీ కి చెందిన నాకు ఈ ప్రాంతంలో బంధువులు ఎవరూ లేకపోవడంతో నా జీవితం చిన్నాభిన్నమై పోయిందని  కన్నీరుమున్నీరయ్యారు. మహిళా సంఘాలు అండగా నిలబడాలని ఆమె కోరారు. దీనిపై ప్రస్తుతం ఎస్సై వై.సుధాకర్ కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతోందని అన్నారు.

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags: Husband who turned maniac law on wife

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *