హూజూరాబాద్ లెక్కేంటీ

కరీంనగర్ ముచ్చట్లు:

 

హుజూరాబాద్ ఉప ఎన్నిక జరగబోతుంది. ఇక్కడ హోరాహోరీ పోరు జరగనుంది. ఇప్పటి వరకూ టీఆర్ఎస్, బీజేపీల మధ్య పోరు ఉంటుందని భావించారు. కానీ తాజాగా రేవంత్ రెడ్డి నియామకంతో పార్టీకి కొత్త ఊపు వచ్చింది. దీంతో కాంగ్రెస్ కూడా రేసులో ఉన్నట్టయింది. హుజూరాబాద్ ఉప ఎన్నికను అధికార టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పవర్ లో ఉండటంతో దానికి ఉండే అడ్వాంటేజీలు దానికి ఉన్నాయి.ఇక ఈటల రాజేందర్ బీజేపీ లో చేరడంతో ఆయనకున్న బలం, బలగం బీజేపీకి ప్లస్ అయింది. ఈటల రాజేందర్ ను ఆరేళ్లుగా గెలిపిస్తూ వస్తున్న హుజూరాబాద్ ప్రజలు ఈసారి ఎటువైపు నిలుస్తారన్నది ఆసక్తికరంగా మారింది. టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరనేది ఖరారు కాకపోయినా బలమైన అభ్యర్థినే బరిలోకి దించనుంది. ఇక కొత్తగా పీసీసీ చీఫ్ గా బాధ్యతలను చేపట్టిన రేవంత్ రెడ్డికి కూడా హుజూరాబాద్ ఎన్నిక సవాల్ అనే చెప్పాలి.హుజూరాబాద్ లో రెడ్డి సామాజికవర్గం ఓటర్లు ఎక్కువ. రేవంత్ రెడ్డి నియామకంతో వీరంతా కాంగ్రెస్ వైపు మళ్లుతారన్న అంచనాలు అయితే విన్పిస్తున్నాయి.

 

 

 

 

రేవంత్ రెడ్డి నియామకంతో హుజూరాబాద్ కాంగ్రెస్ క్యాడర్ లో జోష్ నెలకొందనే చెప్పాలి. రేవంత రెడ్డి కూడా ఈ ఎన్నికలో కనీస పనితీరును చూపించాల్సిన అవసరం ఉంది. దుబ్బాకలో కాంగ్రెస్ ఘోరంగా ఓటమి పాలయింది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో సింగిల్ డిజిట్ కే పరిమితమయింది.ఇప్పుడు రేవంత్ రెడ్డి ముందున్న టాస్క్ ఒక్కటే. హుజూరాబాద్ లో కాంగ్రెస్ ను రెండో స్థానంలోకి తేవడం. రెండోస్థానంలోకి తెచ్చినా రేవంత్ రెడ్డి సక్సెస్ అయినట్లే. బీజేపీ, టీఆర్ఎస్ లో ఎవరు గెలిచినా కాంగ్రెస్ వచ్చే ఎన్నికల్లో మరింత పుంజుకునే అవకాశముంది. అందుకే రేవంత్ రెడ్డి హుజూరాబాద్ ఎన్నికపై ప్రత్యేక దృష్టి పెట్టారు. తన నాయకత్వంపై నమ్మకం పెరగాలంటే ఈ ఎన్నిక తనకు వచ్చిన అవకాశమని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. మొత్తం మీద హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితం తెలంగాణ రాజకీయాల్లో ఒక క్లారిటీ తెస్తుందంటున్నారు విశ్లేషకులు.

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

 

Tags: Huzurabad Lekkenti

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *