నీటి ప్రవాహం లో చిక్కుకున్న యువకుడిని కాపాడిన హుజురాబాద్ పోలీసులు.

Date:15/08/2020

హుజూరాబాద్  ముచ్చట్లు:

నీటి ప్రవాహంలో చిక్కుకుని ప్రాణాపాయ స్థితిలో ఉన్న యువకుడిని ప్రాణాలకు తెగించి  ప్రాణాలు కాపాడారు హుజురాబాద్ పోలీసులు. శుక్రవారం అర్థరాత్రి జరిగిన ఈ సంఘటనలో పోలీసులు చొరవను పోలీస్ కమీషనర్ వీబీ కమలాసం రెడ్డి మెచ్చుకున్నారు.హుజురాబాద్ మండలం లోని జూపాక గ్రామానికి చెందిన గిన్నారపు మహేందర్ (30) అనే యువకుడు శుక్రవారం  అర్ధరాత్రి రోడ్డుపై ప్రవహిస్తున్న నీటిలో చిక్కుకుపోయాడు.  వరద ఉధృతి క్రమ క్రమంగా పెరుగుతుండటం, మరోవైపు తనను రక్షించేందుకు ఎవరూ లేకపోవడంతో హుజురాబాద్ పోలీస్ ఇన్స్పెక్టర్  మాధవికి సెల్ ఫోన్ ద్వారా సమాచారం అందించాడు. సత్వరం స్పందించిన ఇన్స్పెక్టర్ మాధవి సిబ్బందిని వెంటబెట్టుకుని సంఘటన జరిగిన ప్రాంతానికి చేరుకుని తాడు  సహాయంతో యువకుడిని రక్షించి, పోలీసు వాహనం లోనే ఇంటి వద్ద దింపి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

 

 

 

ధైర్యసాహసాలు ప్రదర్శించి నీటి ప్రవాహం లో చిక్కుకున్న యువకుడిని రక్షించిన ఇన్స్పెక్టర్ మాధవి చూపిన చొరవ కు ఇతర పోలీసు సిబ్బందిని కరీంనగర్ పోలీస్ కమిషనర్ విబి కమలాసన్ రెడ్డి  అభినందించారు. ధైర్యసాహసాలు ప్రదర్శించిన పోలీసు అధికారులకు రివార్డులను ప్రకటించారు. యువకుడి ప్రాణాలను రక్షించడంలో ధైర్యసాహసాలు ప్రదర్శించిన  హుజురాబాద్ ఇన్స్పెక్టర్ మాధవి, ఇతర పోలీసులకు రాష్ట్ర జాతీయ స్థాయిలో అవార్డుల ఎంపిక కోసం ప్రతిపాదనలు పంపించనున్నామని అయన  తెలిపారు.

జూరాలకు కొనసాగుతున్న వరద

Tags:Huzurabad police rescue a young man trapped in a stream of water.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *