పొన్నం ప్రభాకర్ కు హూజూరాబాద్ సీటు..?

కరీంనగర్ ముచ్చట్లు:

 

మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో త్వరలో హుజురాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక జరగనున్న క్రమంలో అక్కడి రాజకీయాలు ఇప్పటినుంచే వేడెక్కుతున్నాయి. ఈటల బలమైన నేత కావడం, మాజీ మంత్రిగా పనిచేయడం, ఆయనను ఓడిచేందుకు అధికార టీఆర్ఎస్ ఇప్పటినుంచే ప్రయత్నాలు చేస్తుండటంతో.. హుజురాబాద్ ఉపఎన్నికపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. పార్టీలన్నీ కీలక నేతలను రంగంలోకి దింపి హుజురాబాద్‌లో ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. ఈటలను ఓడిచేందుకు మిగతా పార్టీలు కూడా బలమైన అభ్యర్థులను పోటీలోకి దిపేందుకు కసరత్తు చేస్తున్నాయి. టీఆర్ఎస్, బీజేపీతో పాటు ప్రతిపక్ష కాంగ్రెస్ ఈ ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఇప్పటినుంచే వ్యూహరచనలు చేస్తోంది.టీఆర్ఎస్ అభ్యర్థిగా హరీష్ రావు సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్న కోరం సంజీవరెడ్డి పేరు ప్రముఖంగా రేసులో వినిపిస్తుండగా.. ప్రతిపక్ష కాంగ్రెస్ నుంచి ఎవరు పోటీ చేస్తారనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ క్రమంలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పేరు బాగా వినిపిస్తోంది. రేవంత్‌ రెడ్డి చేసే అన్ని కార్యక్రమాల్లో పొన్నం ప్రభాకర్ ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. రాజీవ్ రైతు భరోసా యాత్ర ముగింపు సభకు సీనియర్లు వద్దన్నా.. పొన్నం ప్రభాకర్ మాత్రం హాజరై రేవంత్‌కు సపోర్ట్ చేశారు.

 

 

 

దీంతో పొన్నం ప్రభాకర్‌కు హుజురాబాద్ టికెట్‌ను కేటాయించే యోచనలో రేవంత్ ఉన్నట్లు సమాచారం.రేవంత్ పీసీసీ చీఫ్‌గా నియామాకం అయిన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నిక కావడంతో.. హుజురాబాద్‌లో ఎలాగైనా కాంగ్రెస్‌ జెండా ఎగురవేయాలనే లక్ష్యంతో రేవంత్ ఉన్నారు. దీంతో తన సన్నిహితుడైన పొన్నం ప్రభాకర్ వైపే రేవంత్ మొగ్గు చూపుతున్నారని సమాచారం. మొన్నటివరకు హుజురాబాద్ కాంగ్రెస్ ఇంచార్జ్, మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి బంధువు కౌశిక్ రెడ్డి పేరు బలంగా వినిపించింది. అయితే దేవరయాంజల్ భూముల విషయంలో కాంగ్రెస్ లైన్‌కు వ్యతిరేకంగా కౌశిక్ రెడ్డి పనిచేయడం, ఒక కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ తో కౌశిక్ రెడ్డి మంతనాలు జరపడంతో.. టీఆర్ఎస్‌కు తొత్తుగా ఆయన వ్యవహరిస్తున్నానే టాక్ నడించింది. దీంతో కౌశిక్ రెడ్డికి హుజురాబాద్ టికెట్ ఇచ్చే అవకాశాలు లేవనే చర్చ నియోజకవర్గంలో జోరుగా జరుగుతోంది.

 

పుంగనూరులో తహశీల్ధార్‌గా పదోన్నతి పొందిన మాదవరాజుకు సన్మానం

 

Tags: Huzurabad seat for Ponnam Prabhakar?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *