హైదరాబాద్‌ నగరాన్ని చలి వణికిస్తోంది

Hyderabad city is getting cold

Hyderabad city is getting cold

Date:31/12/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
ఇటీవల కాలంలో ఎన్నడూ లేనంతగా హైదరాబాద్‌ నగరాన్ని చలి వణికిస్తోంది. శీతల పొడిగాలులతో నగరవాసులు రాత్రివేళల్లో వణికిపోతున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు ఇబ్బంది పడుతున్నారు. ఆదివారం తెల్లవారుజామున కనిష్ఠంగా 10.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇది సాధారణం కంటే 4 డిగ్రీలు తక్కువ. పగటిపూట సాధారణ కంటే ఒక డిగ్రీ తక్కువగా 27.2 గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. మరో వారం రోజుల పాటు పరిస్థితి ఇలాగే ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఉత్తర కోస్తా, ఒడిశాలపై కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం వల్లే నగరంలో చలి తీవ్రత అధికంగా ఉందని తెలిపారు. కనిష్ఠ ఉష్ణోగ్రతలు 10-12 డిగ్రీల మధ్య నమోదవుతాయని వెల్లడించారు. శనివారం నగరంలో అత్యల్పంగా 9.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఓ వైపు చలి నగరాన్ని వణికిస్తున్నా న్యూ ఇయర్ పార్టీల జోష్ మాత్రం తగ్గలేదు. ఈ సారి నగరంలో సుమారు 240 వరకు న్యూ ఇయర్ ఈవెంట్లు నిర్వహిస్తున్నారు. చలి కారణంగా నిర్వాహకుల్లో చలి గుబులు పట్టుకుంది. చలి ఎక్కువగా ఉంటే కుటుంబ సమేతంగా నిర్వహించే పార్టీలకు వచ్చేవారి సంఖ్య తక్కువగా ఉండే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. డిసెంబరు 31న రాత్రి సమయంలో ఉష్ణోగ్రత కనిష్ఠంగా 10 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.
Tags:Hyderabad city is getting cold

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed