హైదరాబాద్ చారిత్రక కట్టడాలకు నెలవు 

Hyderabad is known for its historical monuments

Hyderabad is known for its historical monuments

– బంగ్లాదేశ్ జర్నలిస్టుల  ప్రశంస
Date:11/10/2018
హైదరాబాద్  ముచ్చట్లు:
బంగ్లాదేశ్‌కు చెందిన 20మంది జర్నలిస్టుల బృందం నేడు గురువారం నాడు మొజాంజాహీ మార్కెట్ పున‌రుద్ద‌ర‌ణ‌, చార్మినార్ పెడెస్టేరియ‌న్‌ ప్రాజెక్ట్ లను సందర్శించారు. చార్మినార్ పెడెస్టేరియ‌న్‌ ప్రాజెక్ట్ వద్ద కొద్దిసేపు గడిపారు. జి.హెచ్.ఎం.సి. చార్మినార్ ప్రాజెక్ట్ డైరెక్ట‌ర్ కె. శ్రీనివాసరావు, ప్లానింగ్ అధికారి రంజిత్ కుమారులు చార్మినార్ పెడెస్టేరియ‌న్‌ ప్రాజెక్ట్ విశేషాలను బంగ్లాదేశ్ జ‌ర్న‌లిస్టుల‌కు వివ‌రించారు. ఈ సందర్బంగా అధికారులు మాట్లాడుతూ, చార్మినార్ కు 400 ఏళ్ళ ఘన చరిత్ర ఉన్నదని, చార్మినార్ భాగ్యనగరానికి సరికొత్త వన్నె తెచ్చిందని తెలిపారు. ఈ కట్టడంలో కళా నైపుణ్యం నిర్మాణ చాతుర్యం చూపరులను ఆకట్టుకుంటుందని, నిర్మాణంలో పూర్తిగా సున్నమునే వినియెగించినట్లు తెలిపారు.
జి.హెచ్.ఎం.సి. ప్రధానంగా చార్మినార్ కు నాలుగు వైపుల ఉన్న చార్ కమాన్ లను ఓల్డ్ సిటీకి ప్రత్యేక ఆకర్షణగా ఉన్న చుడి బజార్, ముర్గీ చౌక్, క్లాక్ టవర్, జుల్ఫీకన్ కమాన్ లను, మొజాంజాహీ మార్కెట్ లను పునరుద్ధరించడం ద్వారా వాటికి తిరిగి పునర్వైభవం తేవడానికి ప్రత్యేక నిధులు కేటాయించినట్లు తెలిపారు.  ఈ చార్మినార్ వారసత్వాన్ని కాపాడడానికి పెడెస్టీరియాన్ ప్రాజెక్ట్ ను ఏర్పాటు చేశామని  తెలిపారు.
ఈ ప్రాజెక్ట్ పనుల ద్వారా చార్మినార్ సుందరీకరణ, స్వచ్ఛ కార్యక్రమాల నిర్వహణ, మౌలిక సదుపాయాల కల్పన, బ్యాటరీ వాహనాలను అందించడం జరుగుతున్నదని, ఈ ప్రాజెక్ట్ పనులు  దాదాపుగా పూర్తి అయినట్లు అధికారులు వారికీ వివరించారు.  మొజాంజాహీ మార్కెట్ విశేషాలను వివరిస్తూ, ఈ మార్కెట్ పాతబస్తీ, కొత్త బస్తీలకు నాందిగా నిర్మించారని, గతంలో ఈ మార్కెట్ ప్రముఖ పాన్ బజార్ గా వెలుగొందిందని తెలిపారు. జర్నలిస్టుల బృందం వెంట విదేశీ వ్యవహారాల అండర్ సెక్రటరీ అహ్మద్, మీడియా అకాడమీ కార్యదర్శి బి. రాజమౌళి, బాజ్ పాయ్ లు ఈ కార్యక్రమాలను సమన్వయ పరిచారు.
Tags:Hyderabad is known for its historical monuments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *