రియల్ ఎస్టేట్ రంగంలో హైద్రాబాద్ టాప్

Date:20/08/2019

హైద్రాబాద్ ముచ్చట్లు:

ఏడాదిన్నర కాలంగా దక్షిణాది రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధిలో హైదరాబాద్ నగరం తొలి స్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా ఆరు మెట్రో నగరాల్లో సర్వే నిర్వహించిన ‘నైట్ ఫ్రాంక్’ అనే సంస్థ చెన్నై, బెంగళూరు నగరాల తో పాటు హైదరాబాద్‌లో కూడా సర్వే నిర్వహించగా ఆ రెండు నగరాలకంటే హైదరాబాద్‌లోనే ఎక్కువ రియల్ వ్యాపారం జరుగుతున్న ట్లు తేలింది. నోట్ల రద్దుకు పూర్వం ఉన్న పరిస్థితితో పోలిస్తే ఈ ఏడాదిన్నర కాలంలో గణనీయంగా ఊపందుకున్నట్లు తేల్చింది.

 

 

 

చెన్నై బెంగళూరు నగరాల్లో వార్షిక రియల్ వృద్ధి రేటు మైనస్ 11, మైనస్ 8 శాతంగా నమోదైతే హైదరాబాద్‌లో మాత్రం 44 శాతం ఎక్కువగా జరిగింది ముంబయి, ఢిల్లీ, పూణె నగరాల్లో మాత్రం ఈ వృద్ధి రేటు హైదరాబాద్ కంటే చాలా ఎక్కువగా ఉందని, వరుసగా 128%, 90%, 76% చొప్పున నమోదైనట్లు తేల్చింది. హైదరాబాద్‌లో జరుగుతున్న మొత్తం రియల్ వ్యాపారంలో దాదాపు 64% పశ్చిమ భాగమైన గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్‌లలోనే జరుగుతున్నట్లు తేలింది.వినియోగదారుల ధరల సూచి  తాజా నివేదికను పరిగణనలోకి తీసుకుని దేశవ్యాప్తంగా మెట్రో నగరాలతో పాటు ప్రధాన నగరాల్లోనూ ఈ సర్వే నిర్వహించినట్లు నైట్ ఫ్రాంక్ ప్రతినిధి పేర్కొన్నారు.

 

 

 

 

నోట్లరద్దు సమయంలో దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం స్తబ్దుగా ఉండిందని, అయితే ఆరు నెలల తర్వాత నుంచి పుంజుకుందని, అందువల్లనే ఏడాదిన్నర కాలంలో దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో గణనీయంగా పెరిగినట్లు ఆ ప్రతినిధి తెలిపారు. ఇదే సమయంలో జిఎస్‌టి, ‘రెరా’ చట్టాలు కూడా రావడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏమవుతుందోననే ఆందోళనలు బిల్డర్లు, ప్రమోటర్లతో పాటు భూముల ధరలు, అపార్టుమెంట్ల ధరలు పెరుగుతాయా తగ్గుతాయా అనే అనుమానం సామాన్య ప్రజల్లో కూడా ఉందని ఆయన గుర్తుచేశారు.

 

 

 

దేశం మొత్తంమీద రియల్ ఎస్టేట్ మార్కెట్ ముంబాయిలో భారీ స్థాయిలో పుంజుకుని మొదటి స్థానంలో నిలవగా, ఆ తర్వాత ఢిల్లీ, పూ ణెలు ఉన్నాయని, నాల్గవ స్థానంలో హైదరాబాద్ నిలిచిందని ఆయన పే ర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రం విడిపోయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాజకీయపరమైన స్థిరత్వం ఉండడం కూడా ఇందుకు ఒక కారణమని ఆయన గుర్తుచేశారు. భూముల క్రయవిక్రయాల్లో ఎక్కువగా అపార్ట్‌మెంట్‌లకే వినియోగదారులు మొగ్గు చూపుతున్నారని ఆయన వివరించారు.

 అడ్డూ అదుపు లేని వక్ఫ్ బోర్డు అక్రమణలు.

Tags: Hyderabad is top in the real estate sector

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *