ఐఎస్ఐ కు అడ్డాగా హైదరాబాద్ ఎమ్మెల్యే రాజాసింగ్

హైదరాబాద్ ముచ్చట్లు:

 

పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ కు హైదరాబాద్ అడ్డాగా మారింది. దేశంలో ఎక్కడ పేలుళ్లు జరిగినా హైదరాబాద్ లోనే మూలాలు బయటపడుతున్నాయని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు.   టిఆర్ఎస్ వచ్చాక బ్లాస్ట్ లు తగ్గాయి. ఎంఐఎం,  టిఆర్ఎస్ ఒక్కటైన తర్వాత ఓల్డ్ సిటీ బాంబ్ ఫ్యాక్టరీ గా మారిందని అయన విమర్శించారు.సికింద్రాబాద్ నుంచి బీహార్ వెళ్లిన పార్సిల్ బ్లాస్ట్ ఘటనపై పోలీసులు  విచారణ జరుపుతున్నారు. అసిఫ్ నగర్ కి చెందిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. అందులో ఒకరు పాకిస్థాన్ లో శిక్షణ పొంది వచ్చినట్లు తేలింది. తెలంగాణ ఇంటలిజెన్స్ విభాగం ఎం చేస్తోందని అయన ప్రశ్నించారు.పాకిస్థాన్ కు ఎంత మంది వెళ్తున్నారు. ఇలాంటి వారు ఎంత మంది హైదరాబాద్ లో ఉన్నారు. పాకిస్తాన్ నుంచి వచ్చిన వారిపై పోలీసులు ఎందుకు నిఘా పెట్టడం లేదు. హోం మంత్రి, పోలీసులు ఎం చేస్తున్నారు ? హైదరాబాద్ లో బాంబులు తయారు చేసే పరిశ్రమలు ఎన్ని ఉన్నాయో పోలీసులు బయట పెట్టాలి. అరెస్ట్ అయిన వారి వివరాలు ఎందుకు దాస్తున్నారు. అరెస్ట్ అయిన వారి వెనకాల ఎవరు ఉన్నారు ? ఏ సంస్థకు చెందిన వారో వెలికితీయాలని అయన డిమాండ్ చేసారు.

పుంగనూరులో పనిచేస్తున్న మాదవరాజుకు తహశీల్ధార్‌గా పదోన్నతి

 

Tags: Hyderabad MLA Rajasinghe is behind ISI

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *