Natyam ad

ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కొనసాగాలి

విశాఖపట్నం ముచ్చట్లు:

ఏపీ రాజధానిపై వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖ రాజధానిగా వచ్చేంత వరకు ఏపీకి కూడా హైదరాబాద్ రాజధానిగా కొనసాగితే బాగుంటుందని అన్నారు. గత ప్రభుత్వంకూడా అమరావతిలో తాత్కాలిక రాజధానినే నిర్మించారని, రాజధాని నిర్మించే స్థోమత ప్రస్తుతం ఏపీలో లేదని అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక విశాఖను పరిపాలన రాజధానిగా అనుకున్నాం.. కానీ, దానిపై న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. న్యాయపరమైన చిక్కులు ఎప్పుడు వీడుతాయో తెలియదు.. ఎన్నికల తర్వాత జగన్ మోహన్ రెడ్డి దానిపై వివరణ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. విశాఖ రాజధాని అయ్యేంత వరకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కొనసాగాలని నా భావన అని సుబ్బారెడ్డి అన్నారు.

 

Tags; Hyderabad should continue as joint capital

Post Midle
Post Midle