హైద్రాబాద్ ఇన్నోవేషన్ హబ్ గా మారుస్తాం

Hyderabad will become an innovation hub

Hyderabad will become an innovation hub

Date:23/11/2018
న్యూఢిల్లీ ముచ్చట్లు:
టీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే హైదరాబాద్‌ను ఇన్నోవేషన్ హబ్‌గా మార్చుతుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ‘మన హైదరాబాద్ – మన అందరి హైదరాబాద్’ పేరుతో నిర్వహించిన యువజన సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో ఏర్పడిన అపోహాలను టీఆర్ఎస్ ప్రభుత్వం పటాపంచలు చేసిందన్నారు. కులం, మతం, ప్రాంతం తేడా లేకుండా అందిరికీ ఒకే రకమైన హక్కులు, భద్రత, విశ్వాసం కల్పించిన ప్రగతిశీల రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దామన్నారు. 2014లో తెలంగాణ ఐటీ ఎగుమతులు రూ.56 వేలు కోట్లు ఉండగా, ప్రస్తుతం రూ.లక్ష కోట్లకు చేరాయన్నారు. నాలుగున్నర ఏళ్లలో రాష్ట్రంలో శాంతిభద్రతలను నెలకొల్పడం వల్లే హైదరాబాద్‌కు పెట్టుబడులు తరలివస్తున్నాయని తెలిపారు. దేశవ్యాప్తంగా ఐటీ ఎగుమతుల వృద్ధి 9.4 శాతం ఉండగా.. కేవలం హైదరాబాద్ నుంచే 13.4 శాతం వృద్ధి ఉందన్నారు. ఇది జాతీయస్థాయి కంటే 4 శాతం ఎక్కువన్నారు. హైదరాబాద్‌లో సుమారు 4.5 లక్షలు మందికి ప్రత్యక్ష ఉపాధి లభిస్తోందన్నారు. పరోక్షంగా ఉపాధి పొందుతున్నవారినీ లెక్కిస్తే ఆ సంఖ్య సుమారు 10 లక్షలకు చేరుతుందన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), రోబోటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ తదితర టెక్నాలజీలు హైదరాబాద్‌కు తరలివస్తున్నాయని తెలిపారు. కొండాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్, శేరిలింగంపల్లి ప్రాంతాలకు దీటుగా ఉప్పల్‌ను ఐటీ హబ్‌గా మారుస్తామని కేటీఆర్ అన్నారు. ఉప్పల్‌లోని మల్లాపూర్, నాచారం, చర్లపల్లి ప్రాంతాల్లో గల 300 ఎకరాల్లో ఐటీ పరిశ్రమలు తీసుకువస్తామన్నారు. ఉప్పల్‌లో ఇప్పటికే రూ. 2,184 కోట్లతో అభివృద్ధి చేశామని తెలిపారు.
Tags:Hyderabad will become an innovation hub

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *