అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి

Date:02/12/2020

హైదరాబాద్ ముచ్చట్లు:

అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి చెందాడు. నిద్రలోనే యువకుడు చనిపోయినట్లు తెలుస్తోంది. దీంతో అతను మృతికి కారణాలు ఏంటన్న దానిపై డాక్టర్లు పరిశిలీస్తున్నారు. అతని మరణ వార్తను మృతుడి కుటుంబసభ్యులకు అధికారులు తెలియజేశారు. యువకుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. అయితే పోస్టుమార్టంలో మాత్రం యువకుడి మృతికి కారణాలు ఏం తెలియలేదు. దీంతో మరింత లోతుగా పరిశీలించాలని వైద్యులు చెబుతున్నారు.దీంతో అమెరికాలోని ఆసుపత్రిలోనే మృతదేహాని ఉంచారు. పరీక్షలకు పరీక్షలకు ఆరు నెలల పడుతుందని అక్కడి డాక్టర్లు తెలిపారు. దీంతో మృతదేహం కోసం హైదరాబాద్‌లో కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు. మృతదేహాన్ని వెంటనే భారత్ రప్పించాలని విదేశాంగ మంత్రికి విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా మంత్రి కేటీఆర్ సాయం కూడా కుటుంబసభ్యులు కోరారు. కొడుకు మృతదేహం ఎప్పుడు వస్తుందో తెలియక తల్లిదండ్రుల ఆందోళన చెందుతున్నారు.మృతుడికి భార్య, ఐదేళ్ల కొడుకు ఉన్నారు. భార్యా బిడ్లు హైదరాబాద్‌లోనే ఉండటంతో భార్య, కొడుకు కు ప్రభుత్వం సాయం చేయాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.

 ఫైజర్ టీకా రెడీ

Tags; Hyderabad youth dies in US

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *