జిల్లా కేంద్రంకోసం జలదీక్ష

హిందూపురం ముచ్చట్లు:
 
హిందూపురంను  జిల్లా కేంద్రంగా ప్రకటించాలంటూ   రాజకీయ ఐక్య వేదిక ఆధ్వర్యంలో  అనంతపురం జిల్లా హిందూపురం లోని కొట్నూరు  చెరువులో  జల దీక్ష  కార్యక్రమాన్ని చేపట్టారు .  హిందూపురం జిల్లా కేంద్రం  ఏర్పాటు కోసం ఇప్పుడున్న ప్రజాప్రతినిధులు తమ పదవులకు రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొనాలని లేనిపక్షంలో హిందూపురం  నియోజకవర్గంలోని ప్రజా ప్రతినిధుల  ఇళ్లను ముట్టడిస్తామని  రాజకీయ ఐక్య వేదిక నాయకులు హెచ్చరించారు. ప్రజా ప్రతినిధులు రాజీనామా చేస్తేనే  హిందూపురం జిల్లాగా ఏర్పడే అవకాశం ఉందని  అన్నారు. జిల్లా కేంద్రం ఏర్పాటు  చేసేంతవరకు  తమ ఉద్యమాలు కొనసాగుతాయని తెలిపారు..
 
Tags: Hydration for the district center