I am a Police…

Date:12/08/2018

ఏ నేరస్తుడూ పుట్టుక తోనే నేరస్తుడు కాడు
పరిస్థితుల ప్రభావము వల్లనే అలా మారాడు అంటారుగా అలాగే పోలీసుకూడా ఎదుటివారిని అవమానించి హింసించి ఆనందించాలి అనుకోడు, పరిస్తితుల ప్రభావముతోనే అలా మారతాడు ఎవ్వరికి కష్టాలు వచ్చినా పోలీసులకు చెప్పుకోవచ్చు, కానీ కష్టాలను ఎవ్వరికీ చెప్పుకోలేని ఏకైక ఉద్యోగము ఒక్క పోలీసే, ఉద్యోగము చేస్తే ఒకరు చేయకపోతే మరొకరు నిందిస్తారు.ఏపనికైనా నిర్దేశిత పనిగంటలు వుంటాయి కాని డ్యూటీకి వెళ్ళే సమయమేగానీ తిరిగి వచ్చే సమయము లేనిది ఒక్క పోలీసు ఉద్యోగమే,పోలీసు ఇంటిలో డ్యూటీ వెళ్ళివస్తా అంటారుగానీ, ఎప్పుడువస్తావు డాడీ అని పిల్లలు అడిగితేఏ పోలీసూ సమాదానమూ చెప్పలేడుపండక్కి ఊరువెళ్దాము అని భార్య అడిగితే సమాదానము చెప్పకుండా తప్పించుకు తిరుగుతాడు,* బంధువుల పెళ్ళి, ఇతర శుభకార్యాలకు సెలవులేదు..అసలు ఏ పోలీసునైనా అడగండి వారి పెళ్ళి రోజు, పుట్టినరోజున కనీసము గుడికైనా వెళ్ళరేమోనని.ఇవన్నీ చెపితే జీతాలు తీసుకుంటున్నారుగా అంటారు, కానీ పోలీసుకన్నా ఏక్కువ జీతాలు తీసుకునే ఏ ఉద్యోగికిి అయినా తగిన గౌరవమూ విశ్రాంతి దొరుకుతుంది అది పోలీసులకు కరవు.ఎన్నీ సంస్కరణలు వచ్చినా పోలీసులకు మేలు చేసే ఏ మార్పూ అమలు కాలేదుకాబట్టీ ప్రజలు ఈ ఖాకీలపై కొంచెము కారుణ్యము చూపిస్తే వారు మీకోసము ప్రాణాలు ఇస్తారు. వాళ్ళని మనుషులలా చూడండి చాలు దేవుడిలా మిమ్మల్ని రక్షిస్తారు..

ఆదివారం నాడు పోలీసులు పలు గ్రామాల్లో తనిఖీలు

Tags:i-am-a-police

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *