Natyam ad

కార్యకర్తలకు ఎల్లవేళల అందుబాటులో ఉంటాను

కడప ముచ్చట్లు:

టిడిపి కార్యకర్తలకు, నాయకులకు  న్యాయపరమైన సేవలందించేందుకు  ఎల్లవేళలా అందుబాటులో ఉంటా నాని  టిడిపి లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి అడ్వకేట్ రెడ్డయ్య అన్నారు.   శనివారం ఆయన కార్యాలయంలో టిడిపి నగర అధ్యక్షుడు సా నా పురెడ్డి శివ కొండా రెడ్డి అధ్యక్షతన రెడ్డయ్య కు శాలువాతో సన్మానం చేశారు.   అనంతరం రెడ్డయ్య మాట్లాడుతూ పార్టీపరంగా కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు కలిగిన , చట్టపరమైన సమస్యలు వచ్చినా  ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని న్యాయం చేస్తానని తెలిపారు.   లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శిగా తమ నియామకానికి సహకరించిన టిడిపి నాయకులు కమలాపురం ఇంచార్జి  పుత్త సింహా రెడ్డి కి, కడప ఇంచార్జి   అమీర్ బాబు ,  నగర అధ్యక్షులు శివ కొండా రెడ్డి,  టిడిపి నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.  అనంతరం శివ కొండా రెడ్డి మాట్లాడుతూ  రెడ్డయ్య గత 30 సంవత్సరాల నుండి ఎలాంటి పదవి ఆశించకుండా  టిడిపి కార్యకర్తలకు,  నాయకులకు ఎల్లవేళలా స్పందిస్తూ  ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి క్రిస్టియన్ మైనారిటీ సెల్ అధ్యక్షుడు ప్రేమ్ కుమార్ ఒకటో డివిజన్ ఇన్ఛార్జ్ అంజి 28 వ డివిజన్ ఇన్ఛార్జ్ రాఘవ తెలుగు యువత సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

 

Tags: I am always available to the workers

Post Midle
Post Midle