నేను ఆరోగ్యంగా ఉన్నాను –మంత్రి బాలినేని

Date:5/08/2020

అమరావతి ముచ్చట్లు:

నాకు కరోనా సోకింది.హైదరాబాద్ అపోలో హాస్పిటల్ లో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నాను.  నేను ఆరోగ్యంగా ఉన్నాను. త్వరలోనే ఇంటికి చేరుకుంటానని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ నాయకులు కార్యకర్తలకు తన అభిమానులకు సందేశం పంపారు.
వివరాల్లోకి వెళ్ళితే గత 5 రోజులగా చిన్న పాటి జ్వరం మంత్రి బాలినేనికి వచ్చింది.  ఈ నేపథ్యంలో వైద్యుల సూచన మేరకు హైదరాబాద్ లో ని  తన స్వగృహంలో హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు. జ్వరం వస్తు పోతూ ఉన్నది. ఇతర ఆరోగ్య సమస్యలు ఏవి తలెత్తలేదు. మంగళవారం మరోసారి మంత్రి కి కోవిడ్ పరీక్ష నిర్వహించారు. పాసిటివ్ వచ్చింది. వైద్యులు సలహా మేరకు అపోలో హాస్పిటల్ లో చికిత్స నిమిత్తం చేరారు. ఆరోగ్యంగా ఉన్నారని చికిత్స చేస్తున్న వైద్యులు తెలిపారు.

ఏపీలో తొలిసారి దిశ పోలీస్ స్టేషన్లో ప్రభుత్వ అధికారి పై కేసు 

 

Tags:I am healthy – Minister Balineni

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *