Natyam ad

నేను అభిమన్యుడిని కాదు..అర్జునుడిని-భీమిలీ సభలో సీఎం జగన్

భీమిలీ ముచ్చట్లు:

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార ప్రతిపక్షాల నాయకుల నడుమ మాటల తూటాలు పెలుతున్నాయి. ఈ క్రమంలోనే ఇవాళ భీమిలీ వేదికగ సీఎం జగన్ ఎన్నికల శంఖారావాన్ని పూరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీ, జనసేన పార్టీలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. సభకు హాజరై ప్రజలను చేసి అటు వైపు భీమిలి సముద్రం ఉందని, ఇటు వైపు జన సముద్రం ఉందని అన్నారు. ఇక్కడున్నది అభిమన్యుడు కాదని, అర్జుడినంటూ ప్రతిపక్షాలకు జగన్ సవాల్ విసిరారు. ఎన్నికల బరిలోకి వైసీపీ తరపున తానొక్కడినే బరిలోకి దిగానని.. అటువైపు వెన్నుపోటు, పొత్తులు, ఎత్తులు, జిత్తులు వేసే నాయకులు పోటీకి సిద్ధమవుతున్నారని ధ్వజమెత్తారు. ఇటు పాండువులు ఉంటే.. అటు కౌరవులు ఉన్నారని ఎద్దేవా చేశారు.రాబోయే ఎన్నికల్లో ప్రజలంతా తనకు అండగా ఉన్నారని, వారి అండ ఉన్నాకా తనకు ఎలాంటి భయం లేదని జగన్ అన్నారు. 175 స్థానాలకు గాను 175 గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రతి వైసీసీ కార్యకర్త ఎన్నికలను యుద్ధంలా భావించి పోరాడాలని పిలుపునిచ్చారు. తాము చేసిన మంచి పనులే తమను గెలిపిస్తాయని, చంద్రబాబుతో సహా అందరూ ఓడాల్సిందేనని అన్నారు. రాష్ట్రంలో మరో 25 ఏళ్లు వైసీపీ పాలనే కొనసాగుతుందని అన్నారు. మేనిఫెస్టోను తాము బైబిల్, భగవద్గీతగా భావిస్తామని పేర్కొన్నారు. ఇచ్చిన హామీల్లో 99 శాతం హామీలు అమలు చేసిన పార్టీ వైసీపీయేనని అన్నారు.

 

Post Midle

Tags: I am not Abhimanyu..I am Arjuna- CM Jagan in Bhimili Sabha

Post Midle