నేనే…చెత్తను తొలగిస్తా … పారిశుద్ధ్యంలో రాజీపడను

I am ... removing the garbage ... I will not compromise on sanitation

I am ... removing the garbage ... I will not compromise on sanitation

– కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Date:17/09/2018

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరులో అవసరమైతే ప్రతి రోజు నేనే స్వయంగా పాల్గొని చెత్తను తొలగిస్తా…పారిధశుద్ధ్య కార్యక్రమలకు ఎవరు అటంకం కలిగించినా క్షమించేది లేదు…కఠిన చర్యలు తీసుకుంటానంటు మున్సిపల్‌ కమిషనర్‌ కె.ఎల్‌.వర్మ హెచ్చరించారు.

 

సోమవారం ఆయన పట్టణంలోని సూర్యనగర్‌, కొత్తయిండ్లు, కొత్తపేట ప్రాంతాలలో కమిషనర్‌ స్వయంగా చెత్తను తొలగించే కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి చెందిన కాలనీలలో కొంత మంది ప్రజలు, కొంత మంది పెద్దమనుషులు తమ ఇండ్లలోని చెత్తను తీసుకొచ్చి ఖాళీ స్థలాల్లో , రోడ్లపైన వేసి , పారిశుద్ద్య కార్యక్రమాలకు విఘాతం కలిగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

 

దీని కారణంగా దోమలు ప్రభలి , ప్రజలు అంటురోగాల భారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణంలోని 150 మంది కార్మికులు 11 వేల ఇండ్లలోని చెత్తను తొలగిస్తుంటే కార్మికులకు సహకరించాల్సిన కొంత మంది ప్రజలు ఇలాంటి పనులు చేయడం బాధకరమన్నారు. ఇలాంటి వారికి జరిమానాలు విధించి,

 

మున్సిపల్‌ సేవలను నిలిపివేస్తామని హెచ్చరించారు. ఖాళీ స్థలాల యజమానులు కూడ తమ ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకుని, కంచ వేసుకోవాలన్నారు. లేకపోతే మున్సిపల్‌ నిబంధనల మేరకు ప్రైవేటు స్థలాలను మున్సిపాలిటి స్వాధీనం చేసుకుంటుందని హెచ్చరించారు. దేశ వ్యాప్తంగా పుంగనూరు మున్సిపాలిటికి పారిశుద్ధ్య కార్యక్రమాలలో ఎంతో పేరు ప్రతిష్టలు లభిస్తోందన్నారు. ఇలాంటి తరుణంలో కొంత మంది చర్యలు కారణంగా మున్సిపాలిటిలో ఇబ్బందులు తలెత్తుతోందన్నారు.

 

ఇలాంటి వారిని క్షమించేది లేదన్నారు. ఇకనైనా అపరిశుద్ద్య కార్యక్రమాలు చేసే వారిలో మార్పురావాలన్నారు. ఈవిషయాలపై మున్సిపల్‌ కార్మికులు ప్రతి రోజు వీరిని గుర్తించి, నివేదికలు ఇస్తారని , దానిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది చంద్ర శేఖర్‌, అమరనాథ్‌, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు సురేంద్రబాబు, సఫ్ధర్‌ , కార్మికులు పాల్గొన్నారు.

విద్యార్ధుల్లో నిస్సత్తువ తొలగించేందుకు అల్పాహారం..

 

Tags: I am … removing the garbage … I will not compromise on sanitation

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *