రూ.2కోట్లు ఇస్తే నా ఆస్తులు రాసిస్తా.. మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు

I am writing my assets by giving me Rs. 2 crores. Former MLA Puttu Madhu

I am writing my assets by giving me Rs. 2 crores. Former MLA Puttu Madhu

Date:09/10/2018
పెద్దపల్లి  ముచ్చట్లు:
రూ.900 కోట్లు సంపాదించానని అంటున్నారని, రూ.2కోట్లు ఇస్తే నా ఆస్తులు రాసిస్తానని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు సవాల్ విసిరారు.  కాంగ్రెస్ నేత,మాజీ మంత్రి శ్రీధర్‌బాబు తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆయనఆగ్రహం వ్యక్తం చేశారు. మంథని కేంద్రంగా కొన్ని ముఠాలు ఏర్పాడ్డాయని వెల్లడించారు. నన్ను బద్నామ్ చేసేందుకు ముఠాలకు శ్రీధర్‌బాబు బాధ్యత అప్పజెప్పారని ఆరోపించారు. ఓడిపోతాననే భయంతో శ్రీధర్‌బాబు ఇలాంటి వారిని ప్రేరేపిస్తున్నారు. బిల్లా రమణారెడ్డి గుండా నాగరాజు హత్యకేసులో ముద్దాయి అని తెలిపారు. ముద్దాయికి సాక్ష్యం చెప్పే అధికారం ఉంటుందా అని ప్రశ్నించారు.అని ప్రశ్నించారు. పేదవాళ్లు ఎమ్మెల్యేలు కాకూడదా..?అని మధు ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీధర్‌బాబు రచిస్తున్న నాటకాల్లో భాగంగానే నాపై కుట్ర జరుగుతోందని తెలిపారు. ఎన్నికల వేళ నాపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు. నాపై కేసులు ఉంటే శ్రీధర్‌బాబు మంత్రిగా ఉన్నప్పుడు వదిలిపెట్టేవారాఅని అడిగారు.
Tags:I am writing my assets by giving me Rs. 2 crores. Former MLA Puttu Madhu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *