ఇంత ఘోరం చూడలేదు

I can not see this terrible

I can not see this terrible

Date:12/10/2018
నెల్లూరు  ముచ్చట్లు:
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, మోదీ, అమిత్ షాలు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుండటం దురదృష్టకరం. ఎమర్జెన్సీ రోజులను తలపించేలా పాలన సాగిస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అరోపించారు. శుక్రవారం నాడు అయన  నెల్లూరు రూరల్ మండలం మాదరాజు గూడూరులో మీడియాతో మాట్లాడారు. దేశంలోని బీజేపీ వ్యతిరేకులందరిపై కక్షసాధిస్తూ జైళ్లకు పంపుతున్నారు. కడపలో ఉక్కు పరిశ్రమ కోసం 11 రోజులు ఆమరణ దీక్ష చేసి కేంద్రంపై పోరాడిన టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ పై ఐటీ అధికారులను ఉసిగొల్పారని అన్నారు. రాజ్యసభలో మిమ్మల్ని నిలదీశారని రమేష్ పై కక్ష పెంచుకున్నారు.
నిత్యం జనం మధ్య బతికే సీఆర్డీఏ డైరెక్టర్, కావలి మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్ రావును వారం రోజులుగా వేధిస్తున్నారని అయన విమర్శించారు. మొన్న కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావును ఐటీ దాడుల పేరుతో హింసించారు. ప్రజాస్వామ్య విరుద్ధమైన చర్యలతో కర్కోటకంగా, దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు.బీజేపీతో లాలూచీ పడిన వైకాపాలో వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు లేరా అని ప్రశ్నించారు. వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి పీఎంఓలో తిష్టవేసి పైరవీలు చేస్తున్నారు.
ఎన్నికలకు ముందు టీడీపీ నేతలను టార్గెట్ చేశారని అన్నారు. 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఇలాంటి ఘోరమైన చర్యలను ఎన్నడూ చూడలేదు. ప్రజలన్నీ గమనిస్తున్నారు. మొన్న కర్ణాటక ఎన్నికల్లో గుణపాఠం చెప్పారు. 2019లో దేశమంతా బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. బీజేపీ నియంతృత్వ చర్యలకు వ్యతిరేకంగా దేశంలోని ప్రతిపక్ష పార్టీలన్నీ ఐక్యమై ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైందని మంత్రి వ్యాఖ్యానించారు.
Tags:I can not see this terrible

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *