దారుణ వ్యాఖ్యలు నేను వినలేదు

Date:13/01/2021

విజయవాడ ముచ్చట్లు:

ఏపీలో ఆలయాలపై దాడుల పేరుతో సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు డీజీపీ గౌతమ్ సవాంగ్. తన సర్వీసులో పోలీసులపై ఇలాంటి వ్యాఖ్యలు ఎప్పుడూ వినలేదని.. పోలీసులు రాజ్యాంగానికి లోబడే పనిచేస్తారన్నారు.. ఎంతో సంయమనంతో వ్యవహరించారన్నారు. రాజకీయ కారణాలతో పోలీసులపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. రాష్ట్ర, జిల్లా స్థాయిలో మతసామరస్య కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. పోలీస్‌స్టేషన్ల పరిధిలో కూడా కమిటీలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.అంతర్వేది ఘటన తర్వాత రాష్ట్రంలో కొన్ని ఘటనలు జరిగాయని.. అంతర్వేది ఘటనపై సీబీఐ విచారణకు ప్రభుత్వం ఆదేశించిందని గుర్తు చేశారు. రాష్ట్రంలోని 58, 871 హిందూ ఆలయాలను జియో ట్యాగింగ్ చేశామని.. 13వేల ఆలయాల్లో 43వేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గడిచిన రెండు నెలల్లోనే 30వేల సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించామన్నారు.

 

 

అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై సమాచారం ఇవ్వాలని, ఆలయాలపై ప్రత్యేకంగా 93929 03400 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని డీజీపీ తెలిపారు. మూడు నెలల కిందటే రామతీర్థం ఆలయంలో భద్రత పెంచాలని సూచించామని.. ప్రధాన ఆలయంలో అదనంగా 16 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించామన్నారు. కొండపైన ఉన్న ఆలయంలో విద్యుత్ సరఫరా లేక సీసీ కెమెరాలు ఏర్పాటు చేయలేదని.. మరో రెండు రోజుల్లో కొండపై సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తారనగా ఈ ఘటన జరిగిందన్నారు.గతేడాదిలో పోలీస్ శాఖకు అనేక సవాళ్లు ఎదురయ్యాయి.. 2020లో అనేక సవాళ్లను ఎదుర్కొన్నామని.. కరోనా సమయంలో రాత్రింబవళ్లు కష్టపడి పని చేశామన్నారు డీజీపీ. ప్రజలకు ఇబ్బందులు లేకుండా పోలీసులు చొరవ తీసుకున్నారు. కరోనాతో 109 మంది పోలీసులు మరణించారు. పోలీసులు లాక్‌డౌన్‌, కరోనాను ఛాలెంజ్‌గా తీసుకుని పనిచేశారు. టెక్నాలజీ విభాగంలో ఏపీ పోలీస్ శాఖకు 100కుపైగా అవార్డులు వచ్చాయి.

ఆసక్తికరంగా జమ్మలమడుగు పంచాయితీ

Tags:I did not hear the outrageous comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *