నేను కాలీప్లవర్ పంట పండించలేదు-మాకు నష్టము లేదు
– రైతులు జనార్ధన్‌నాయుడు, మోహన్
పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు మండలం నేతిగుట్లపల్లె వద్ద నిర్మిస్తున్న రిజర్వాయర్‌తో రైతుల పంటలు దెబ్బతిని నష్టపోతున్నారని ఈనెల 18న ఆంధ్రజ్యోతి జిల్లా పేజిలో కథనం ఆవాస్తవమని ఏటిగడ్డకమ్మపల్లె రైతులు జనార్ధన్‌నాయుడు, మోహన్‌లు తెలిపారు. బుధవారం రైతులు విలేకరులతో మాట్లాడుతూ తెలిపారు. జనార్ధన్‌నాయుడు మాట్లాడుతూ తనకు ఏటిగడ్డకమ్మపల్లెలో పొలం ఉందని, తనకు బోరులేదని , కాలీప్లవర్ పంట పండించలేదని కానీ ఆంధ్రజ్యోతిలో తాను కాలీప్లవర్ పంట పండించగా మునిగిపోయినట్లు అసత్యకథనాలు ప్రచురించారన్నారు. మోహన్ మాట్లాడుతూ రిజర్వాయర్ నిర్మాణంతో తమ ప్రాంతం సస్యశ్యామలమౌతుందని తెలిపారు. గతంలో ఏ ప్రభుత్వము తమ ప్రాంత అభివృద్ధికి చర్యలు తీసుకోలేదన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రైతులకు సాగునీరు, తాగునీరు అందిస్తుంటే చూసి ఓర్వలేక తెలుగుదేశం నాయకులు తప్పుడు వార్తలు రాయిస్తున్నారని ఆరోపించారు.
Tags: I didn’t grow cauliflower—we had no loss
