నాకు బాష అర్ధం కాదనుకోవడం అవివేకం

I do not mean to understand the meaning of it
మీడియా ప్రతినిధిపై నిర్మలా సీతారామన్‌ అసహనం
Date:24/11/2018
భోపాల్‌ ముచ్చట్లు:
కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ఓ మీడియా ప్రతినిధిపై అసహనం వ్యక్తం చేశారు. ఆ విలేకరి వ్యంగ్యంగా అడిగిన ప్రశ్నపై ఆమె మండిపడ్డారు. భోపాల్‌లో జరిగిన మీడియా సమావేశంలోనిర్మలా సీతారామన్‌ మీడియా సమావేశంలో మాట్లాడుతుండగా.. ఓ విలేకరి పాక్‌పై భారత సైన్యం నిర్వహించిన మెరుపుదాడుల గురించి ఓ ప్రశ్న అడిగారు. మెరుపు దాడులు చేపట్టి రెండేళ్లు గడుస్తున్నప్పటికీ.. ఆ ఘటనను ప్రస్తావిస్తూ ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పటికీ ఎందుకు డప్పు కొట్టుకుంటోందని(బిన్‌ బజాయే‌) విలేకరి ప్రశ్నించారు. ఈ ప్రశ్నపై చిరాకుపడ్డ సీతారామన్‌.. ‘మీరు వ్యంగ్యంగా ప్రశ్న అడిగిన తీరు నన్ను బాధించింది. మీరు ‘బిన్ ‌బజాయే’ పదం ఉపయోగించారు. నాకు హిందీ అర్థమవుతుంది’ అని మండిపడ్డారు.మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్‌షాతో పాటు ఆ పార్టీ నేతలు.. భారత సైన్యం జరిపిన మెరుపుదాడుల గురించి పదేపదే ప్రస్తావిస్తుండటంపై ఆ మీడియా ప్రతినిధి ఈ విధంగా ప్రశ్నించారు. దీనిపై సీతారామన్‌ సమాధానమిస్తూ ‘ఈ మెరుపు దాడులు ప్రతి భారతీయుడు గర్వించదగ్గవి. శత్రువులపై దాడి సిగ్గుపడే అంశమా?. వాళ్లు ఉగ్రవాదుల సాయంతో మన సైనికులపై దాడికి దిగుతున్నారు. మనం వారి క్యాంపులను లక్ష్యంగా చేసుకొని దాడులు నిర్వహించాం’ అని చెప్పారు. వ్యంగ్యంగా ఈ ప్రశ్న అడిగిన తీరు నన్ను బాధించిందని పేర్కొన్నారు. ‘ఒకవేళ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇలాంటి మెరుపుదాడులు నిర్వహిస్తే.. ఆ పార్టీ ప్రచారం చేసుకోవచ్చు. ఎందుకంటే దేశం గర్వించదగ్గ విషయాలు ఇవి’ అని సీతారామన్‌ పేర్కొన్నారు.
Tags:I do not mean to understand the meaning of it

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *